|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టూర్‌ బాగా జరిగిందా..?

Published: 05-06-2025, 3:41 PM
టూర్‌ బాగా జరిగిందా..?

ఓటీటీలో విడుదలైన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ తమిళ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. శ్రీలంక నుండి వలస వచ్చిన కుటుంబం తమిళనాడులో ఎదుర్కొన్న సవాళ్లు, వారి జీవితంలోని సంఘటనలు ఈ సినిమాలో చూపించారు.

Key Points

1

శ్రీలంక నుండి వచ్చిన కుటుంబం తమిళనాడులో అక్రమంగా స్థిరపడటం.

2

కాలనీలోని విచిత్రమైన వాతావరణం మరియు వారి జీవితంలో సంఘటనల ప్రభావం.

4

ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ థ్రిల్లర్‌గా సినిమా విశేషాలు.

శ్రీలంక కుటుంబం యొక్క భారత ప్రయాణం

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’(Tourist Family) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

మన ఇరుగు పొరుగు ఎవరున్నారో, ఏం చేస్తున్నారో అని తెలుసుకునే అవకాశం, తీరిక లేని బిజీ రోజుల్లో గడుపుతున్నాం. మన పొరుగింట్లో దొంగ దూరినా లేదా దొర వచ్చినా మనకు తెలిసే సమయానికి తెల్లారిపోతుంది. కానీ అదే ఇరుగు పొరుగు వారి  కోసం ఓ కాలనీ వాళ్ళు ఏం చేశారన్నదే ఈ ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’( Tourist Family ) సినిమా. జియో హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ఈ సినిమాకు ప్రముఖుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా బాగా దక్కింది. మరీ ముఖ్యంగా మన ప్రపంచ స్థాయి దర్శక జక్కన్న రాజమౌళి ఈ సినిమాని ప్రశంసించడం విశేషం. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం.

కేశవనగర్ కాలనీలో జీవితం

శ్రీలంక దేశం నుండి ధర్మాన దాస్‌ కుటుంబం అక్రమంగా సముద్ర మార్గాన భారత్‌లోని తమిళనాడు తీర ప్రాంతానికి చేరుకుంటుంది. ధర్మాన దాస్‌ సతీమణి వాసంతి. వాళ్ళకిద్దరు పిల్లలు నితూషన్, ముల్లి. శ్రీలంకలో సంక్షోభం వల్ల భారత్‌లో సంపాదించడానికి వాసంతి సోదరుడు ప్రకాశ్‌ సహాయంతో కుటుంబం అంతా రామేశ్వరానికి వస్తారు. అదే ఊర్లో ఉన్న కేశవనగర్‌ కాలనీలో ఓ ఇంట్లోకి అద్దెకి చేరతారు. ఆ కాలనీ చాలా విచిత్రమైనది. ఎవ్వరి మార్గం వాళ్ళది అన్నట్టుగా ఉంటారు. ధర్మాన దాస్‌ తమ శ్రీలంక ఉనికి ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు.

ఈ లోపల అదే ఊరిలోని ఓ చెత్త కుప్పలో భారీ బాంబు పేలుడు సంభవిస్తుంది. అంతకుముందే ధర్మాన దాస్‌ ఆ చెత్త తొట్టిలో తాము తిన్న పదార్థాల కవర్‌ వేస్తాడు. అది కాస్తా సీసీ టీవీలో రికార్డు అవుతుంది. దాంతోపోలీసులు ధర్మాన దాస్‌ కుటుంబం కోసం గాలిస్తుంటారు. ఓ పక్క తమ శ్రీలంక ఐడెంటీటీ ఇతరులకు తెలియనివ్వకుండా, మరో పక్క ఈపోలీస్‌ కేసును దర్మాన దాస్‌ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందో ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్‌ కామెడీ థ్రిల్లర్‌ అని చెప్పవచ్చు.

బాంబు పేలుడు మరియు పోలీసుల దర్యాప్తు

ఈ సినిమాకి మూల కథ రాసుకుని అభిషన్‌ జీవింత్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు శశికుమార్‌ హీరో పాత్రలో నటించగా, ప్రముఖ నటి సిమ్రాన్‌ హీరోయిన్‌గా నటించి అలరించారు. ముఖ్యంగా ధర్మాన దాస్‌ చిన్న కొడుకు ముల్లి పెట్టే గిలిగింతలు మామూలుగా ఉండవు. సినిమా మంచి ఎంటర్‌టైనర్‌. హాట్‌ స్టార్‌లో తెలుగులోనూ లభ్యమవుతోంది. ఇంకెందుకు ఆలస్యం… ఈ ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’తో ఈ వారం టూర్‌కి వెళ్ళండి. – హరికృష్ణ ఇంటూరు

మొత్తంమీద, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఒక ఆకర్షణీయమైన కథాంశంతో కూడిన సినిమా. కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా ఇది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.