|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కర్ణాటకలో పెను విషాదం: ముగ్గురు పోలీసు అధికారుల దుర్మరణం! తీవ్ర దిగ్భ్రాంతిలో హోం మంత్రి!

Published: 16-03-2026, 12:05 AM
కర్ణాటకలో పెను విషాదం: ముగ్గురు పోలీసు అధికారుల దుర్మరణం! తీవ్ర దిగ్భ్రాంతిలో హోం మంత్రి!
  • చిత్రదుర్గ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
  • ప్రమాదంలో ముగ్గురు ఆర్ఎస్ఐలు దుర్మరణం చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
  • హెగ్గెరె సమీపంలోని జాతీయ రహదారిపై టిప్పర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
  • కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆర్ఎస్ఐలు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై హోం మంత్రి జి. పరమేశ్వర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన స్వయంగా పరిశీలించారు.

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆర్ఎస్ఐలు మృతి

రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు ఆర్ఎస్‌ఐ (Reserve Sub Inspectors)లు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన కర్ణాటక రాష్ట్రంలో చిత్రదుర్గ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మంజునాథ్ దారుమణి, అమరేష్, సచిన్, మహంతేష్ బొమ్మన్నవర్, ఈశ్వర్ ఐదగురు ఆర్ఎస్ఐ‌లు హెగ్గెరె సమీపంలోని జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు చల్లకెరె తాలూకాలోకి చేరుకోగానే ఎదురుగా ఉన్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహంతేష్ బొమ్మన్నవర్, ఈశ్వర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే, ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసకున్న కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర (G Parameswara) ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విధి నిర్వహణలో ఉన్న యువ అధికారులు ఇలా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ఆసుపత్రికి క్షతగాత్రులు

ఘటనా స్థలాన్ని సందర్శించిన హోం మంత్రి పరమేశ్వర

ఈ దుర్ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో ఉన్న అధికారుల మరణం బాధాకరం. ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.