|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి పుట్టినరోజున ఉదయ భాను త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్- వాళ్లే అసలైన బాణాలు అంటూ బాహుబలి కట్టప్ప కామెంట్స్

Published: 06-08-2025, 2:50 AM
చిరంజీవి పుట్టినరోజున ఉదయ భాను త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్- వాళ్లే అసలైన బాణాలు అంటూ బాహుబలి కట్టప్ప కామెంట్స్

మారుతి సమర్పణలో వచ్చిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం ఆగస్టు 22న విడుదలవుతోంది. సత్యరాజ్, ఉదయ భాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం చిరంజీవి పుట్టినరోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు తమ పాత్రల గురించి, చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Key Points

1

త్రిబాణధారి బార్బరిక్ చిత్రం ఆగస్టు 22న విడుదలవుతోంది.

2

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రం విడుదల అవుతోంది.

4

కథే ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర అని సత్యరాజ్ అభిప్రాయపడ్డారు.

త్రిబాణధారి బార్బరిక్ విడుదల తేదీ ప్రకటన

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్ర పోషించారు.

అలాగే, త్రిబాణధారి బార్బరిక్ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్ , యాంకర్ ఉదయ భాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నటీనటులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సత్యరాజ్ మాట్లాడుతూ .. “త్రిబాణధారి బార్బరిక్ సినిమాలో పని చేసినందుకు ఆనందంగా ఉంది. మేమంతా కూడా మాదే మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ, ఇందులో కథే మెయిన్ హీరో. డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ వీళ్లే అసలైన బాణాలు” అని అన్నారు.

“ఈశ్వర్ గారు నాతో డ్యాన్స్ చేయించారు. రమేష్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను. కెమెరా యాంగిల్‌తోనే సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు. అలా దర్శకుడు, కెమెరామెన్ కలిసి అద్భుతం చేశారు” అని సత్యరాజ్ తెలిపారు.

నటీనటుల ఆసక్తికర వ్యాఖ్యలు

“70 ఏళ్లు దాటినా కూడా నేను కొత్త కొత్త పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. రెగ్యులర్ పాత్రల్ని కాకుండా ‘బార్బరిక్’ లాంటి కొత్త పాత్రల్ని మరిన్ని చేయాలని అనుకుంటున్నాను” అని సత్యరాజ్ చెప్పుకొచ్చారు.

“నా డియర్ ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న త్రిభాణధారి బార్బరిక్ విడుదల కాబోతోంది. చిరంజీవి గారు కంప్లీట్ యాక్టర్. ఆయన గొప్ప నటుడు, డ్యాన్సర్, అద్భుతమైన వ్యక్తి. మా మూవీ ఆయన పుట్టిన రోజున రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది” అని బాహుబలి కట్టప్ప సత్యరాజ్ పేర్కొన్నారు.

ఉదయ భాను మాట్లాడుతూ .. “నేనేమీ సినిమాలకు దూరంగా ఉండలేదు. నాకు నచ్చిన పాత్రలు వస్తేనే నటిస్తున్నాను. ఆర్టిస్టులకు ఉండే ఆకలిని తీర్చే పాత్రలో ప్రస్తుతం నటించాను. ‘బార్బిరిక్’ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ పాత్రను మోహన్ గారు నాకు ఇచ్చారు. ప్రతీ పాత్రను నేను ప్రాణం పెట్టి పోషిస్తాను” అని అన్నారు.

చిరంజీవి పుట్టినరోజు విడుదల

“నాకు రాజేష్ మంచి స్నేహితుడు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా నన్ను కన్విన్స్ చేస్తుంటారు. మోహన్ గారు నెరేట్ చేసినప్పుడు ఆ కథ, ప్రతీ సీన్ నా కంటికి కనిపించింది. మన భాషలో ఇలాంటి చిత్రాలెందుకు రావు? అని అంతా అంటుంటారు. అలాంటి వారిని ఆశ్చర్యపరిచేలా మా చిత్రం ఉంటుంది” అని ఉదయభాను తెలిపారు.

“విజయ్ పాల్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఇలాంటి నిర్మాతలకు సక్సెస్ వస్తే ఇంకెంతో మందిని పైకి తీసుకు వస్తారు. వశిష్ట చాలా మంచి వ్యక్తి. క్రాంతి ఎనర్జీ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. సాంచీ, మేఘన అందరం కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. రమేష్ గారు మా అందరినీ చక్కగా చూపించారు” అని యాంకర్ ఉదయ భాను పేర్కొన్నారు.

“సత్యరాజ్ గారితో పని చేయడం మా అదృష్టం. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. ఆయన్నుంచి మేమంతా ఎంతో నేర్చుకున్నాం. ఈ చిత్రం అందరికీ కన్నుల పండువగా ఉంటుంది. అందరూ చూసి ఆదరించండి” అని యాంకర్ ఉదయ భాను తన స్పీచ్ ముగించారు.

చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతున్న త్రిబాణధారి బార్బరిక్ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. సత్యరాజ్ మరియు ఉదయ భాను వంటి నటీనటుల ప్రదర్శనలు చూడదగినవి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.