
తమిళ సూపర్‌స్టార్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరి మధ్య డేటింగ్ పుకార్లు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. త్రిష తల్లి కూడా ఆ పోస్ట్‌ను షేర్ చేయడంతో చర్చ మరింత జోరందుకుంది.
Key Points
త్రిష విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఫోటోలో త్రిష, విజయ్‌తో పాటు ఆమె పెంపుడు కుక్క కూడా ఉంది.
త్రిష తల్లి కూడా ఆ పోస్ట్‌ను షేర్ చేయడం చర్చకు దారితీసింది.
అభిమానులు వారిద్దరి సంబంధం గురించి పలు అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ పుట్టినరోజు పోస్ట్‌తో మరోసారి చర్చ
తమిళ నటీనటులు త్రిష కృష్ణన్, విజయ్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. ప్రైవసీ మెయింటేన్ చేసే విజయ్ తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఎప్పుడూ మాట్లాడనప్పటికీ.. త్రిషతో కలిసిన ప్రతిసారి ఈ పుకార్లు మళ్లీ మళ్లీ తెరపైకి వస్తాయి. ఇప్పుడు ఆమె అతనికి చేసిన పుట్టినరోజు పోస్ట్ ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తోంది.
త్రిష తన సోషల్ మీడియాలో విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అందమైన ఫోటోను పోస్ట్ చేసింది. తన పెంపుడు కుక్క ఇజ్జీతో విజయ్ ఆడుకుంటుండగా, త్రిష అతని నుండి కళ్లు తిప్పుకోలేనట్లుగా చూస్తుండటం ఆ ఫొటోలో కనిపిస్తుంది.
“హ్యాపీ బర్త్‌డే బెస్ట్‌స్ట్” అనే క్యాప్షన్ తోపాటు ఓ హగ్ ఇస్తున్న ఎమోజీని కూడా పెట్టడం విశేషం. దీంతో ఆమె కామెంట్ సెక్షన్ రెడ్ హార్ట్ ఎమోజీలతో నిండిపోయింది. అభిమానులు వారిని ‘రెండు క్యూటీస్’ లేదా ‘లవ్లీ కపుల్’ అని పిలుస్తున్నారు.
త్రిష తల్లి స్పందన
విజయ్, త్రిష ఇప్పుడు ‘అధికారికంగా’ తమ బంధాన్ని అనౌన్స్ చేశారా అని ఆశ్చర్యపోతూ.. కొంతమంది రెడిట్ యూజర్లు ఆ ఫోటోలోని ప్రతి చిన్న అంశాన్ని విశ్లేషించడానికి ప్రయత్నించారు. కొంతమంది విజయ్ అభిమానులు ఆ ఫోటో ‘ ది గోట్ ‘ విజయోత్సవ వేడుకల నుండి వచ్చిందని భావించగా, ఒకరు ఇలా పేర్కొన్నారు.
“ఈ ఫోటో గోట్ విజయోత్సవ వేడుకల నుండి వచ్చినట్లయితే ఇవి ఎలా సాధ్యం? అతను ఇజ్జీని పట్టుకున్నాడు. త్రిష 2025 ఫిబ్రవరిలో దత్తత తీసుకున్న కుక్క అది. లెక్క సరిపోవడం లేదు” అని ప్రశ్నించారు.
ఇక మరో రెడిటర్ త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ స్క్రీన్‌షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. అందులో ఆమె త్రిష విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పోస్ట్‌ను హార్ట్ ఎమోజిలతో తిరిగి షేర్ చేసింది. “త్రిష విజయ్‌కి శుభాకాంక్షలు చెప్పడం సరే. ఇప్పుడు ఆమె తల్లి అన్ని హార్ట్‌లు ఎందుకు పోస్ట్ చేస్తోంది??!!” అంటూ ఆ రెడిట్ యూజర్ ప్రశ్నించారు.
అభిమానుల అంచనాలు
త్రిష, విజయ్ ‘ఘిల్లి’, ‘లియో’ వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు. ‘ది గోట్’లో ఆమె అతిథి పాత్రలో కూడా నటించింది. విజయ్ 1999లో సంగీతను వివాహం చేసుకున్నాడు. వారికి సంజయ్, దివ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్రిష, విజయ్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు మొదట ఆమె అతని 50వ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఎలివేటర్ సెల్ఫీని పోస్ట్ చేసినప్పుడు బయటపడ్డాయి.
వారు గోవాలో కూడా కలిసి కనిపించారు. వాళ్లిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని అప్పటి నుంచీ అభిమానులు ఫిక్సయిపోయారు. అయితే తాజాగా త్రిష చేసిన ఈ బర్త్ డే పోస్ట్ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది.
త్రిష, విజయ్‌ల మధ్య ఉన్న బంధంపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ పోస్ట్‌తో వారి సంబంధంపై మరింత స్పష్టత వస్తుందో లేదో చూడాలి.


