|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెమ్యునరేషన్‌తో ఆర్‌ నారాయణ మూర్తిని కొనలేం: త్రివిక్రమ్‌

Published: 12-08-2025, 3:19 AM
రెమ్యునరేషన్‌తో ఆర్‌ నారాయణ మూర్తిని కొనలేం: త్రివిక్రమ్‌

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఆర్. నారాయణమూర్తి దర్శకత్వం వహించిన ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ చిత్రాన్ని వీక్షించారు. సినిమా గురించి తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. నారాయణమూర్తి పనితీరును ప్రశంసించిన త్రివిక్రమ్, ఆయన రెమ్యునరేషన్ కంటే ఎంతో విలువైన వ్యక్తి అని అన్నారు.

Key Points

1

త్రివిక్రమ్ శ్రీనివాస్ 'యూనివర్సిటీ పేపర్ లీక్' చిత్రాన్ని ప్రశంసించారు.

2

ఆర్. నారాయణమూర్తిని రెమ్యునరేషన్ తో కొనలేమని త్రివిక్రమ్ అభిప్రాయం.

4

నారాయణమూర్తి వన్ మ్యాన్ ఆర్మీ అని, ఆయనలా బతకడం అందరికీ సాధ్యం కాదని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డారు.

త్రివిక్రమ్ ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ చిత్రంపై అభిప్రాయం

‘ఆర్ ‌ నారాయణ మూర్తి మాదిరి రాజీ లేకుండా బతకడం నా వల్ల కాదు . నేను చాలా సార్లు రాజీపడ్డాను . అందుకే నారాయణ మూర్తిని చూస్తే నాకు కొంచెం ఈర్ష్య కూడా ఉంటుంది ’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ‌ శ్రీనివాస్ ‌. ఆర్ నారాయణమూర్తి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’ . ఆగస్ట్ ‌ 22 న ఈ చిత్రం విడుదల కాబోతుంది . ఈ నేపథ్యంలో తాజాగా ప్రసాద్ ‌ ల్యాబ్ ‌ లో వేసిన స్పెషల్ ‌ షోని త్రివిక్రమ్ ‌ చూశారు .

ఆర్. నారాయణమూర్తి పనితీరుపై త్రివిక్రమ్ ప్రశంసలు

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..‘ ఈ సినిమా నిడివి (2 గంటలు ) చూసి కాస్త భయపడ్డాను . కానీ సినిమా స్టార్ట్ ‌ అయ్యాక .. అసలు సమయమే తెలియలేదు . ప్రారంభం నుంచి చివరి వరకు వేగంగా సాగింది . ఈ సినిమాలో చూపించిన ఆంశాలు తక్షణమే ఉత్తేజపరచవు. అయినప్పటికీ సినిమా పట్టువిడవకుండా నడిపించారాయన. నిజాయతీతో పని చేశారు. దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అది ఆయన సొంతం. దాని కోసమే నేను వచ్చా .

రెమ్యునరేషన్ కంటే నిజాయితీ ముఖ్యమని త్రివిక్రమ్ వ్యాఖ్య

ఓ సినిమాలోని పాత్రకు నారాయణ మూర్తిని అనుకున్నా . కానీ రెమ్యునరేషన్ ‌ తో ఆయన్ని కొనలేం అని ఎవరో చెప్పారు . ఆయనలా బతకడం అందరికి సాధ్యం కాదు . నారాయణ మూర్తి వన్ ‌ మ్యాన్ ‌ ఆర్మీ . ఆయన చిత్రాల్లో ఆయనే రాజు , ఆయనే సైన్యాధిపతి . ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రయోజనం ఉండాలనుకుంటారు. అణచివేతకు గురైన వారి తరఫున మాట్లాడేందుకు ఒక గొంతుక ఉంది. అది అందరికీ వినపడాలి. అది మనకు నచ్చొచ్చు.. నచ్చకపోవచ్చు. కానీ, ఇలాంటి వారు మాట్లాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రపంచంలో ఏక పక్ష ధోరణి నెలకొంటుంది ’ అని త్రివిక్రమ్ ‌ అన్నారు .

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్. నారాయణమూర్తి యొక్క నిజాయితీని, వన్ మ్యాన్ ఆర్మీ లాంటి పనితీరును ప్రశంసించారు. రెమ్యునరేషన్ కంటే ఆయన విలువలు ఎక్కువ అని స్పష్టం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.