
📌 Key Points
- రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా మిస్ అవ్వడానికి కారణాలివే!
- వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘House No 47 – AK47’ మూవీ సమ్మర్ 2026 రిలీజ్!
- శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని ఎంటర్టైన్‌మెంట్స్!
- గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన కాంబినేషన్ ఇది!
టాలీవుడ్ లో ఒక సంచలనం! రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా మిస్ అయిందంటే నమ్మగలరా? అసలు ఎందుకు ఈ కాంబినేషన్ సెట్ కాలేదు? అలాగే వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రామ్ చరణ్, త్రివిక్రమ్ సినిమా ఎందుకు మిస్ అయింది?
టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు అనే పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల తూటాలు పేల్చే ఈ దర్శకుడు.. కామెడీ పంచ్ లతో సీరియస్ క్యారెక్టర్ తో కూడా హాస్యం పండించగలడు. ఆయన డైలాగ్స్ రాసిన సినిమాలైనా.. డైరెక్షన్ చేసిన సినిమాలైనా.. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. అలాంటి అద్భుతమైన సినిమాలు అందించిన త్రివిక్రమ్.. ఈమధ్య కాలంలో ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేయాల్సి వస్తోంది.
టాలీవుడ్ లో రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్.. రైటర్ గా కింగ్ నాగార్జున, వెంకటేష్, చిరంజీవి సినిమాలకు పనిచేశారు. దర్శకుడిగా మారిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎక్కువ సినిమాలు చేసిన ఆయన..అల్లు అర్జున్ తో జులాయ్, ఎన్టీఆర్ తో అరవింద సమేత, మహేష్ బాబుతో ఖాలేజా, గుంటూరు కారం లాంటి సినిమాలు చేశారు. అయితే టాలీవుడ్ లో ఆయన చాలామంది స్టార్ హీరోలతో పనిచేశారు కానీ.. మెగా పవర్ స్టార్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. కారణం ఏంటంటే?
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ అప్డేట్స్
త్రివిక్రమ్-రామ్ చరణ్ కలిసి సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అందులో నిజం లేదని.. గతంలోనే నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమాతో పాటు, ఎన్టీఆర్ తో ఒక మూవీ ఉందని అన్నారు.
అయితే గతంలో త్రివిక్రమ్- రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా చేయాల్సింది మిస్ అయ్యిందట. ఈ విషయంలో అఫీషియలం ఇన్ఫర్మేషన్ లేదు కానీ.. త్రివిక్రమ్ చరణ్ కు కథ చెప్పాడని, అది విని చరణ్ బాగుంది.. చేద్దాం అని అన్నాడని టాక్. కానీ ఆతరువాత కొన్ని పరిణామాల వల్ల.. ఈసినిమా సెట్స్ వరకూ వెళ్లలేదట. ఇందులో నిజం ఎంతో తెలియాల్సిఉంది.
‘House No 47 – AK47’ మూవీ విశేషాలు
ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం House No 47 – AK47 అనే సినిమాను చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ కాంబినేషన్ లో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి.
ఇక ఈ సినిమా షూటింది హైదరాబాద్‌లోని అలుమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా సమ్మర్ 2026 విడుదల లక్ష్యంగా షూటింగ్ చాలా స్పీడ్ గా చేస్తున్నట్టు సమాచారం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ది హారిక అండ్ హాస్సిన్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
కాబట్టి, రామ్ చరణ్, త్రివిక్రమ్ మూవీ మిస్ అవ్వడానికి గల కారణాలు, వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ అప్డేట్స్ తెలుసుకున్నారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


