
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దాదాపు 20 నెలల విరామం తర్వాత సెట్స్ పైకి వచ్చారు. విక్టరీ వెంకటేష్ తో ఆయన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. గతంలో విజయవంతమైన చిత్రాలకు కథ, మాటలు అందించిన వీరి కాంబోలో మళ్ళీ సినిమా రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Key Points
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దాదాపు 20 నెలల విరామం తర్వాత తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
విక్టరీ వెంకటేష్ తో ఆయన నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది.
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా ఇది.
మీనాక్షి చౌదరి లేదా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించే అవకాశం; 2026లో సినిమా విడుదల ప్లాన్.
త్రివిక్రమ్ రీ-ఎంట్రీ: 20 నెలల సుదీర్ఘ విరామం
Trivikram-Venkatesh: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ బ్యాక్ టూ సెట్స్ వచ్చారు. గుంటూరు కారం సినిమా తరువాత దాదాపు 20 నెలల గ్యాప్ తరువాత ఆయన షూట్ లో అడుగుపెట్టారు. ఇటీవల విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమాను స్టార్ట్ చేశారు త్రివిక్రమ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. అక్టోబర్ 8 బుధవారం ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టారు త్రివిక్రమ్. దీనికి సంబందించి లొకేషన్ నుంచి ఒక ఫోటోను సోషల్ మీడియాలో (Trivikram-Venkatesh)రిలీజ్ చేశారు. హీరో వెంకటేష్ తో దర్శకుడు త్రివిక్రమ్ ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో, త్రివిక్రమ్, వెంకటేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.
Director Jayashankar: ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి.. ‘అరి’ కోసం హిమాలయాలకు: డైరెక్టర్ జయశంకర్
వెంకటేష్-త్రివిక్రమ్ కాంబో ప్రత్యేకత
ఇక వెంకటేష్-త్రివిక్రమ్ కాంబో విషయానికి వస్తే. వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు కథ, మాటలు అందించారు త్రివిక్రమ్. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడియన్స్ ఈ సినిమాలను ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమాలు టీవీలో వస్తే తప్పకుండా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అంటే ఆ ఎగ్జైట్ మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి హైప్ ఇప్పుడు వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాకు క్రియేట్ అవుతోంది.
సినిమా వివరాలు: హీరోయిన్, విడుదల ప్లాన్
మరోసారి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాల రేంజ్ లో ఆడియన్స్ ను అలరించడానికి ఈ ఇద్దరు సిద్ధం అవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి లేదా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఇక సినిమా షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేసి 2026 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
త్రివిక్రమ్, వెంకటేష్ కాంబోలో వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. 2026లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం పాత విజయాల మ్యాజిక్ ను తిరిగి సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.


