
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించనున్నారు. ఈ నిర్ణయం టాలీవుడ్ సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చర్చించే కథనమిది.
Key Points
ట్రంప్ అమెరికాలో విడుదలయ్యే విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించనున్నారు.
టాలీవుడ్ సినిమాలు అమెరికాలో మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి.
అమెరికాలో టారిఫ్ పెరిగితే టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
టారిఫ్ వల్ల టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల లాభాలు తగ్గే అవకాశం ఉంది.
ట్రంప్ టారిఫ్ నిర్ణయం
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్‍లతో డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలపై భారీగా టారిఫ్‍లను విధిస్తామని ప్రకటించారు. అమెరికాకు ఎగుమతి చేస్తున్న దేశాలపై సుంకాలు వేయనున్నట్టు వెల్లడించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో కొన్ని రోజులుగా అనిశ్చితి నెలకొంది. అయితే, చైనా మినహా అన్ని దేశాలకు టారిఫ్‍లను 90 రోజులు ఆపారు. తాజాగా ఇప్పుడు సినమా రంగంపై ట్రంప్ పడ్డారు. భారీ సుంకాన్ని విధించేందుకు ఆదేశాలు ఇచ్చారు.
వేరే దేశాల్లో నిర్మితమై అమెరికాలో విడుదలయ్యే సినిమాలపై 100 శాతం టారిఫ్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ నేడు (మే 5) ప్రకటించారు. అమెరికాలో సినిమా ఇండస్ట్రీ వేగంగా చతికిల పడుతోందని, అందుకే తమ దేశంలో సినిమాలను ప్రొడ్యూజ్ చేయడాన్ని పెంచేందుకు ఇలా సుంకాలను విధిస్తున్నానని ప్రకటించారు.
టాలీవుడ్ పై ప్రభావం
అమెరికాలోనే సినిమా రూపొందాలని తాను అనుకుంటున్నట్టు డొనాల్డ్ ట్రంప్ నేడు ట్వీట్ చేశారు. “అమెరికాలో సినీ ఇండస్ట్రీ వేగంగా నాశనం అవుతోంది. అమెరికా నుంచి స్టూడియోలను, ఫిల్మ్ మేకర్లను ఆకర్షించేందుకు ఇతర దేశాలు రాయితీలను ఇస్తున్నాయి. హాలీవుడ్ సహా అమెరికాలోని చాలా ప్రాంతాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇది వేరే దేశాల పనే. ఇది జాతీయ భద్రతకు కూడా ముప్పుగా ఉంది. వీటితో పాటు తప్పుడు ప్రచారం కూడా అదనంగా జరుగుతోంది” అని ట్రంప్ రాసుకొచ్చారు.
అమెరికా బయట ప్రొడ్యూజ్ అయి తమ దేశంలో విడుదలయ్యే సినిమాలకు 100 శాతం టారిఫ్ విధించాలని ఆదేశించినట్టు ట్రంప్ వెల్లడించారు. “విదేశాల్లో ప్రొడ్యూజ్ అయ్యే మన దేశానికి వచ్చే అన్ని సినిమాలపై 100 శాతం టారిఫ్ విధించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ ప్రతినిధులను ఆదేశిస్తున్నా. మళ్లీ అమెరికాలో సినిమా రూపొందడమే మాకు కావాలి” అని ట్రంప్ పేర్కొన్నారు.
టికెట్ ధరలు మరియు లాభాలు
చాలా తెలుగు సినిమాలు అమెరికాలో మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు మేజర్ మార్కెట్‍గా ఉంది. ఓవర్సీస్ వసూళ్లలో టాలీవుడ్‍కు అమెరికానే కీలకంగా ఉంది. అయితే, టాలీవుడ్ చిత్రాలపై అమెరికాలో 100 శాతం టారిఫ్ పడితే.. అక్కడ టికెట్ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ టికెట్ ధరలు ఆ రేంజ్‍లో పెంచేస్తే ప్రేక్షకులు తగ్గే రిస్క్ ఉంటుంది. సుంకాల భారాన్ని డిస్ట్రిబ్యూటర్లు మోస్తే లాభాలు తగ్గుతాయి. అమెరికా థియేట్రికల్ హక్కుల ద్వారా సినిమాలకు దక్కేది తక్కువతుతుంది. అయితే, ఈ టారిఫ్ అమలైతే టాలీవుడ్‍పై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇంకా క్లారిటీ కావాల్సి ఉంది. మరి సినిమాలపై ట్రంప్ టారిఫ్ లు ఎప్పుడు అమలులోకి వస్తాయో.. లేకపోతే ఆయన ఏమైనా మళ్లీ వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి.
ట్రంప్ నిర్ణయం టాలీవుడ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. టికెట్ ధరలు పెరిగితే ప్రేక్షకులు తగ్గే అవకాశం ఉంది. లాభాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.


