|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రంప్ ధాటికి కుప్పకూలిన ఫార్మా షేర్లు! భారతీయ కంపెనీలకు దిమ్మతిరిగే షాక్!

Published: 02-04-2026, 5:35 AM
ట్రంప్ ధాటికి కుప్పకూలిన ఫార్మా షేర్లు! భారతీయ కంపెనీలకు దిమ్మతిరిగే షాక్!
  • ట్రంప్ నిర్ణయంతో 100% టారిఫ్‌లు విధించే అవకాశం
  • భారత ఫార్మా కంపెనీల షేర్లలో భారీ పతనం
  • పెట్టుబడిదారుల ఆందోళన, అమ్మకాల ఒత్తిడి
  • ఎగుమతులపై ఖర్చులు రెట్టింపు అయ్యే ప్రమాదం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఫార్మా రంగానికి షాక్ ఇచ్చారు. దిగుమతి అయ్యే ఔషధాలపై 100 శాతం టారిఫ్‌లు విధించే యోచనలో ఉన్నారు. దీనితో భారత ఫార్మా కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు.

ట్రంప్ టారిఫ్ నిర్ణయం: ఫార్మా రంగంపై పిడుగు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు షాక్‍ల మీద షాక్‍లు ఇస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ తో యుద్ధం విషయంలో తికమక మాటలు మాట్లాడుతున్న ట్రంప్ తాజాగా భారతీయ ఫార్మా రంగంపై కొరడా ఝుళిపించబోతున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే కొన్ని రకాల ఔషధాలపై ఏకంగా 100 శాతం టారిఫ్‌లు విధించేలే యోచనలో అమెరికా ఉందని తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో భారత ఫార్మా రంగ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ వార్త బయటకు రావడంతో భారత స్టాక్ మార్కెట్‌లో సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, బయోకాన్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.

టారిఫ్‍ల వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఫార్మా కంపెనీల ఆదాయంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ట్రేడింగ్ ప్రారంభంలోనే ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ సుంకాలు అమలులోకి వస్తే, అమెరికాకు మందులను ఎగుమతి చేసే భారతీయ కంపెనీలకు ఖర్చులు రెట్టింపై సంస్థల ఆధాయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

షేర్ మార్కెట్ లో కుప్పకూలిన ఫార్మా కంపెనీలు

భారతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం!

ట్రంప్ నిర్ణయం భారత ఫార్మా రంగానికి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. దీని ప్రభావం కంపెనీల ఆదాయంపై ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండటం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.