
📌 Key Points
- మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
- విద్యార్థుల హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
- గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఓఎంఆర్ షీట్ విధానం ఉంటుంది.
- www.bse.telangana.gov.in లో OMR షీట్ నమూనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 14 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి కూడా ఓఎంఆర్ షీట్ విధానం ఉంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈనెల 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే పరీక్షలకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు.
గతేడాది మాదిరిగానే ఈసారి పరీక్షల్లో కూడా ఓఎంఆర్ షీట్ విధానం ఉంటుందని పరీక్షల విభాగం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. గత ఏడాది ఆన్సర్ షీటుకు ఓఎంఆర్ షీట్ జత చేసి విద్యార్థులకు అందజేశారు. ఈసారి కూడా అదే మాదిరిగానే ఆన్సర్ షీట్ కు ఓఎంఆర్ షీట్ ఉండనుంది. విద్యార్థులు…. ఆన్సర్ బుక్‌లెట్‌కు జతచేయబడిన OMR షీట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఓఎంఆర్ షీట్ విధానంపై విద్యాశాఖ ప్రకటన
ఓఎంఆర్ ఫార్మాట్‌పై విద్యార్థులకు అవగాహన పెంచుకోవడానికి వీలుగా నమూనా కాపీలను అందుబాటులోకి తీసుకువచ్చారు.విద్యార్థులు www.bse.telangana.gov.in మరియు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్లలోకి వెళ్లి OMR షీట్ తో కూడిన ఆన్సర్ బుక్‌లెట్ కాపీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఓఎంఆర్ షీట్ డౌన్‌లోడ్ విధానం
ఇక ఈసారి జరగబోయే టెన్త్ పరీక్షలను 2,676 కేంద్రాలలో నిర్వహిస్తారు. 5.28 లక్షలకు పైగా విద్యార్థులు మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు రాస్తారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి.
టెన్త్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచిస్తుంది. పరీక్షలను విజయవంతంగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆశిద్దాం.


