
📌 Key Points
- తుంబాద్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది.
- బోనీ కపూర్ ఈ సీక్వెల్ లో భాగం కానున్నారు.
- 20వ శతాబ్దపు మహారాష్ట్రలోని తుంబాద్ గ్రామం నేపధ్యంలో కథ.
- ఈ ఏడాది చివరి నాటికి సినిమా విడుదల కావచ్చు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయే హారర్ చిత్రం తుంబాద్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు బోనీ కపూర్ కూడా జాయిన్ అయ్యారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తుంబాద్ 2: షూటింగ్ ప్రారంభం
Tumbbad 2: ఈ మధ్యకాలంలో జానర్ తో సంబంధం లేకుండా ప్రతి చిత్రానికి ప్రేక్షకుడి నుంచి కంటెంట్ ఉంటే చాలు ఆదరణ భారీగా లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ కథాంశం, అద్భుతమైన విజువల్స్ తో ఒళ్ళు గగుర్పొడిచే జానపద హారర్ చిత్రం తుంబాద్. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సినిమా చూస్తున్నంత సేపు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది. ఇక ఇలాంటి సినిమాకు సీక్వెల్ ప్రకటించగానే ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. అన్నట్టుగానే ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. తుంబాద్.. అత్యాశ, ధనాశ, పేరాశ గురించి కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. అందుకే ఈ సీక్వెల్ అనగానే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు భారతీయ సినిమా హిస్టరీ లోనే అత్యుత్తమమైన కథనంతో రూపొందించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందిస్తున్నామని సోహమ్ షా ప్రకటించగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ తుంబాద్ 2 కోసం ఏకంగా బోనీ కపూర్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ గత నాలుగు రోజుల క్రితమే ప్రారంభమైంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమాను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.
సినిమా స్టోరీ లైన్ వివరాలు
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. 20వ శతాబ్దపు ప్రారంభంలో మహారాష్ట్రలోని తుంబాద్ అనే ఒక గ్రామ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. భూమాత తొలి సంతానమైన హస్తర్ అనే దేవుడికి సంబంధించిన పురాణ గాధ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హస్తర్ వద్ద అపారమైన బంగారం ఉంటుంది. దానిని సొంతం చేసుకోవాలని వినాయక్ రావు (సోహమ్ షా) చేసే ప్రయత్నాలు ఆ క్రమంలో ఎదురయ్యే భయానక పరిణామాలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. తరతరాలుగా సాగే ఈ అత్యాశ ప్రయాణం చివరికి వినాయక్ రావు ను ఏ తీరానికి చేర్చింది అనేది ఈ సినిమా అసలు కథ.. ఇక దర్శకుడు , నటుడు అయిన సోహమ్ షా ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డారు. జానపద కథాంశాన్ని అత్యంత రక్తి కట్టించే విజువలైజేషన్ తో తెరకెక్కించడానికి ఆయన సుమారుగా సంవత్సరాలు తరబడి శ్రమించారు. ఇక ఆ కష్టం ప్రతి ఫ్రేమ్ లో మనకు చాలా అద్భుతంగా కనిపించింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకే సీక్వెల్ ప్రకటించగానే ఆసక్తి నెలకొంది..
ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాలు
ఈ సినిమా షూటింగ్ ముహూర్తం షార్ట్ తో చాలా ఘనంగా ప్రారంభం అయింది.. మొదటి భాగం కంటే విజువల్ గా మరింత గ్రాండ్ గా ఉండబోతుందని సమాచారం.. ఇకపోతే తుంబాద్ మొదటి భాగం కేవలం హిందీ కే పరిమితమైంది. కానీ ఇప్పుడు అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. హస్తర్ పురాణంలోని మరిన్ని రహస్యాలను విప్పుతూ తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు.
తుంబాద్ 2 సినిమా మొదటి సినిమాను మించి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.


