
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవల తల్లి అయ్యారు. ఇప్పుడు ఆమె నటించిన ‘టన్నెల్’ సినిమా తెలుగులో విడుదల కాబోతోంది. తమిళంలో విజయం సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
Key Points
తల్లి అయిన తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన తొలి సినిమా ‘టన్నెల్’
క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ చిత్రం
సెప్టెంబర్ 19న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్
లావణ్య త్రిపాఠి తొలి సినిమా ‘టన్నెల్’
Tunnel : మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవలే పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ లో సందడి నెలకొంది. లావణ్య తల్లి అయినా తర్వాత తను హీరోయిన్ గా నటించిన ఓ సినిమా రిలీజ్ కాబోతుంది.(Tunnel)
అథర్వా మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన సినిమా ‘టన్నెల్’. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల తమిళ్ లో రిలీజయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం
Also See : Varun Tej Lavanya Tripathi : మెగా వారసుడొచ్చాడు.. తండ్రి అయిన వరుణ్ తేజ్.. ఆనందంలో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు..
టన్నెల్ సినిమా ఇప్పుడు తెలుగులో సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతుంది. రవీంద్ర మాధవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ.రాజు నాయక్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇటీవలే తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ గా సాగిన టన్నెల్ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి నెలకొంది.
సెప్టెంబర్ 19న గ్రాండ్ రిలీజ్
మొత్తంమీద, ‘టన్నెల్’ సినిమా లావణ్య త్రిపాఠి అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిద్దాం. సెప్టెంబర్ 19 వరకు వేచి చూద్దాం.


