|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి దీపికా.. పరిస్థితి దారుణంగా ఉంది దయచేసి ప్రార్థించండి అంటూ ఎమోషనల్ పోస్ట్

Updated: 28-05-2025, 10:25 AM
క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి దీపికా.. పరిస్థితి దారుణంగా ఉంది దయచేసి ప్రార్థించండి అంటూ ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ టీవీ నటి దీపికా కాకర్ తాజాగా తనకు లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆమెకు స్టేజ్-2 క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. ఆమె ప్రార్థనల కోసం అభిమానులను కోరింది.

Key Points

1

ప్రముఖ టీవీ నటి దీపికా కాకర్‌కు క్యాన్సర్ నిర్ధారణ.

2

లివర్‌లో టెన్నిస్ బాల్ సైజు కణితి గుర్తింపు.

4

దీపికా అభిమానుల ప్రార్థనల కోసం విజ్ఞప్తి చేసింది.

దీపికా కాకర్ ఆరోగ్య పరిస్థితి

ప్రముఖ టీవీ సీరియల్ నటి దీపికా కాకర్(Deepika Kakar) ‘నీర్ భరే తేరే నైనా దేవి’(Nir Bhare Tere Naina Devi) లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసి తన పాపులారిటీని పెంచుకుంది. అంతేకాకుండా పలె సెలబ్రిటీ మాస్టర్ చెఫ్‌లలో కనిపించి సందడి చేసింది. ఇక రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ పాల్గొంది. వరుస సీరియల్స్‌లో కెరీర్ పీక్స్‌లో ఉండగా షోయబ్ ఇబ్బహీంను పెళ్లి చేసుకుంది. ఇక అంతా బాగుంది అనుకునే సమయంలో దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ దీపికా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘గత కొన్ని వారాలుగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాను.

లివర్ క్యాన్సర్ నిర్ధారణ

నా కడుపు పైభాగంలో విపరీతమైన నొప్పి రావడంతో ఆసుప్రతుల చుట్టూ తిరగాను. వైద్య పరీక్షల్లో కాలేయంలో టెన్నిస్ బాల్ అంత కణితిని వైద్యులు గుర్తించారు. ఆ కణితి ప్రమాదకర దశలో ఉంది. స్టేజ్-2 దశలో ఉన్న క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రాణాంతక లివర్ క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. దైవబలం, అభిమానుల ఆశీర్వాదాలు, ఆదరణతో ఈ ప్రమాదాన్ని విజయవంతంగా అదిగమిస్తాను. దయచేసి నాకోసం మీరంతా ప్రార్థించండి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

అభిమానుల ప్రార్థన కోసం విజ్ఞప్తి

A post shared by Dipika (@ms.dipika)

దీపికా కాకర్‌కు వైద్యులు చేస్తున్న చికిత్సతో పాటు, అభిమానుల ఆశీర్వాదాలు, ప్రార్థనలు ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయని ఆశిద్దాం. ఆమె త్వరగా కోలుకోవాలని మనమందరం ఆకాంక్షిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.