|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒకే హీరోతో డేటింగ్ చేశాం: ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు

Published: 15-11-2025, 2:11 AM
ఒకే హీరోతో డేటింగ్ చేశాం: ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు

బాలీవుడ్‌ నటీమణులు కాజోల్, ట్వింకిల్ ఖన్నా వ్యాఖ్యాతలుగా కొనసాగుతున్న ‘టూ మచ్’ సెలబ్రిటీ టాక్‌ షోలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పెళ్లికి ముందే వీరిద్దరూ ఒకే హీరోతో డేటింగ్ చేశారనే షాకింగ్ విషయాన్ని వారు పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.

Key Points

1

కాజోల్, ట్వింకిల్ ఖన్నా ‘టూ మచ్’ సెలబ్రిటీ టాక్‌ షోలో ఒక సీక్రెట్ వెల్లడించారు.

2

పెళ్లికి ముందు తాము ఇద్దరం ఒకే బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేసినట్లు ప్రకటించారు.

4

కాజోల్ అజయ్ దేవగన్‌ను, ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు.

కాజోల్, ట్వింకిల్ ఖన్నా డేటింగ్ సీక్రెట్

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కాజోల్‌ (Kajol), ట్వింకిల్‌ ఖన్నా (Twinkle Khanna) వ్యాఖ్యాతలుగా  కొనసాగుతున్న సెలబ్రిటీ టాక్‌ షో ‘టూ మచ్‌’ (Two Much) గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.  ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో  తాజాగా విడుదలైన ఎపిసోడ్‌లో వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

గతంలో వీరిద్దరు ఒకేసారి.. ఒకే హీరోతో డేటింగ్ చేసినట్లు  షాకింగ్‌ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే, అదంతా తమ పెళ్లికి ముందేనంటూ క్లారిటీ ఇచ్చారు. గతంలో ఇలాంటి సీక్రెట్స్‌ చెప్పాలంటే ఎవరైనా కాస్త ఆలోచించేవారు. అయితే, ప్రస్తుతం చాలా సింపుల్‌గా బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. వారిద్దరితో డేటింగ్‌ చేసిన ఆ హీరో ఎవరంటూ సోషల్‌మీడియాలో  చర్చలు మొదలయ్యాయి. కొందరు అభిషేక్ కపూర్ అంటూ కామెంట్‌ చేస్తే ఇంకొందరు మాత్రం అక్షయ్ కమార్ అని పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా వారిద్దరూ మాత్రం నిజ జీవితంలో వేరువేరు వ్యక్తులను  పెళ్లి చేసుకున్నారనేది నిజం.  కాజోల్ అజయ్ దేవగన్‌ను పెళ్లి చేసుకుంటే.. ట్వింకిల్ ఖన్నా మాత్రం అక్షయ్‌ను వివాహం చేసుకుంది.

‘టూ మచ్’ షోలో వైరల్ వ్యాఖ్యలు

ఆ హీరో ఎవరు? సోషల్‌మీడియాలో చర్చ

కాజోల్, ట్వింకిల్ ఖన్నా వెల్లడించిన ఈ సీక్రెట్ బాలీవుడ్ వర్గాల్లో, అభిమానులలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ హీరో ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉన్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితాలపై ఆసక్తిని రేకెత్తించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.