|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉదయ్ కిరణ్ ఫేవరెట్ ఫుడ్ ఇదేనా? సింపుల్ టేస్ట్! అక్క చెప్పిన షాకింగ్ నిజాలు వైరల్!

Published: 16-02-2026, 9:05 AM
ఉదయ్ కిరణ్ ఫేవరెట్ ఫుడ్ ఇదేనా? సింపుల్ టేస్ట్! అక్క చెప్పిన షాకింగ్ నిజాలు వైరల్!
  • ఉదయ్ కిరణ్ ఫేవరెట్ ఫుడ్: ఆలూ ఫ్రై, చారు, చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అని తెలిపిన శ్రీదేవి!
  • మనసంతా నువ్వే మూవీ రీ రిలీజ్‌కి అద్భుత స్పందన; ప్రేమికుల రోజున లవర్స్ పండగ చేసుకున్నారు!
  • చివరి వరకు తన బాధను ఎవరికీ చెప్పలేదని ఉదయ్ కిరణ్ గురించి తెలిపిన అక్క శ్రీదేవి.
  • ఉదయ్ కిరణ్‌కి సినిమా అవకాశాలు చాలా వచ్చాయి, కానీ మంచి చిత్రాలనే ఎంచుకున్నాడు – శ్రీదేవి

టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఆయన అక్క శ్రీదేవి స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు చూద్దాం!

ఉదయ్ కిరణ్ ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?

లవర్‌ బాయ్‌ ఉదయ్‌ కిరణ్‌ ఇప్పుడు మన మధ్య లేరు. కానీ ఆయన తన సినిమాలతో మన మధ్యనే ఉన్నట్టుగా ఉంది. తన లవ్‌ స్టోరీస్‌తో ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. లవ్‌ స్టోరీస్‌ చూడాలంటే ఆయన మూవీస్‌ బెస్ట్ ఛాయిస్‌ అవుతున్నాయి. ఇటీవల ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన నటించిన `మనసంతా నువ్వే` మూవీ రీ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. దీనికి విశేషమైన స్పందన లభించింది. ప్రేమికుల రోజు రీ రిలీజ్‌ కావడంతో లవర్స్ పండగ చేసుకున్నారని చెప్పొచ్చు.

ఈ క్రమంలో ఉదయ్‌ కిరణ్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన అక్కడ శ్రీదేవి ఈ విషయాలను పంచుకుంది. ఉదయ్‌ కిరణ్‌ ఫేవరేట్‌ ఫుడ్‌ ఏంటో తెలిపింది. ఏదైనా సంతోషంలో ఉన్నప్పుడు తనకు ఇష్టమైన ఫుడ్‌ తింటాడట. అది స్వయంగా తనే చేసి పెట్టేదట. సినిమాలు రిలీజ్‌ అయినప్పుడు, సక్సెస్‌ అయినప్పుడు ఇలా తమతోనే ఉండి సెలబ్రేట్‌ చేసుకునేవాడట.

మనసంతా నువ్వే రీ రిలీజ్.. లవర్స్ పండగ!

ఈ క్రమంలో ఉదయ్‌ కిరణ్‌కి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో చెప్పింది శ్రీదేవి. ఆలుగడ్డ ఫ్రై అంటే ఇష్టమట. ఎంతో ఇష్టంగా తినేవాడట. అలాగే చారు, చింతపండు పులిహోరని బాగా ఇష్టంగా తినేవాడట. తన ఆహార అలవాట్లు చాలా సింపుల్‌గా ఉండేవని తెలిపింది. వీటినే ఎక్కువగా తినేవాడట. టేస్ట్ లు కూడా సింపుల్‌గా ఉండేవని తెలిపింది శ్రీదేవి. లేటెస్ట్ గా ఆమె సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది.

`మనసంతా నువ్వే` చిత్రంలో ఎలా అయితే ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడో, ఇంట్లో కూడా అలానే ఉండేవాడని, ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేవాడని, తన బాధని ఎప్పుడూ చెప్పేవాడు కాదని తెలిపారు. హ్యాపీగా ఉండే పర్సన్‌ అని, కానీ మనసులో ఇంత బాధపెట్టుకున్నాడనే విషయం తమకు అర్థం కాలేదని, చివర్లో కూడా ఏం చెప్పలేదని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు, సినిమా అవకాశాలు రావడం లేదనేది నిజం కాదని, తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ మంచి సినిమాలు చేయాలనుకునేవాడు. సెలక్టీవ్‌గా వెళ్లేవాడు. అదే సమయంలో తన భార్యతోనూ గొడవలు లేవని, వారిద్దరు హ్యాపీగా ఉండేవారని తెలిపింది ఉదయ్‌ కిరణ్‌ అక్క.

ఉదయ్ కిరణ్ గురించి అక్క శ్రీదేవి షాకింగ్ విషయాలు!

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఉదయ కిరణ్‌ `చిత్రం` సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. హీరోగా నటించిన తొలి చిత్రంతోనే హిట్‌ అందుకున్నాడు. టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత `నువ్వు నేను`, `మనసంతా నువ్వే` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. వరుసగా హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. దీంతో విశేషమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. లవర్‌ బాయ్‌ అనే ట్యాగ్‌ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన `కలుసుకోవాలని` కూడా పెద్ద హిట్‌ అయ్యింది. కానీ ఆ తర్వాత నుంచే ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ డౌన్‌ అయ్యింది. ఉదయ్‌ కిరణ్‌ 2014 జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉదయ్ కిరణ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. త్వరలో మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తాం. డోంట్ మిస్!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.