|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: టీవీకే విజయంపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు! డీఎంకే వ్యూహం మారుతుందా?

Published: 04-06-2026, 4:30 PM
షాకింగ్: టీవీకే విజయంపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు! డీఎంకే వ్యూహం మారుతుందా?
  • తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయంపై ఉదయనిధి స్టాలిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
  • డీఎంకే తమ నిజమైన ప్రత్యర్థిని గుర్తించడంలో విఫలమైందని అంగీకరించారు.
  • టీవీకే తెరవెనుక బలం పెంచుకుందని తాము అంచనా వేయలేకపోయామని తెలిపారు.
  • రాబోయే రోజుల్లో డీఎంకే కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అనూహ్య విజయంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రత్యర్థిని గుర్తించడంలో విఫలమైందని అంగీకరించిన ఆయన, ఇకపై కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఉదయనిధి స్టాలిన్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత తలపతి విజయ్‌ (Thalapathy Vijay)పై డీఎంకే శాసనసభా పక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తొలిసారి ఆసక్తిర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత సీఎం విజయ్ ఇంతటి భారీ విజయాన్ని సాధిస్తారని తాము అస్సలు ఊహించలేదని అన్నారు. గత ఎన్నికల సరళిని విశ్లేషిస్తూ ఉదయనిధి స్టాలిన్ తమ పార్టీ చేసిన కొన్ని పొరపాట్లను నిర్మొహమాటంగా అంగీకరించారు. రాజకీయాల్లో తమ నిజమైన ప్రత్యర్థి ఎవరు అనేది గుర్తించడంలో మేము పూర్తిగా విఫలమయ్యామని అన్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో పెద్దగా బలం లేని, లేనిపోని శత్రువులతో పోరాడుతూ తమ విలువైన సమయాన్ని, శక్తిని వృథా చేసుకున్నామని తెలిపారు. కానీ తెరవెనుక విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇంతటి బలమైన పునాదిని నిర్మించుకుంటుందని అంచనా వేయలేకపోయామని ఉదయనిధి పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో డీఎంకే (DMK) సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుందని ఉదయనిధి స్పష్టం చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, అసలైన రాజకీయ సవాలు ఎక్కడ ఉందో మాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని అన్నారు. ఇకపై మా పూర్తి దృష్టి ఆ దిశగానే ఉంటుందని చెబుతూ అధికార టీవీకే ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు.

డీఎంకే వ్యూహాత్మక తప్పిదాలు

భవిష్యత్ రాజకీయాలపై డీఎంకే ప్రణాళిక

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు డీఎంకేలో అంతర్గత సమీక్షకు దారితీసే అవకాశం ఉంది. టీవీకేను తమ ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించిన డీఎంకే, రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ వ్యూహాలు అనుసరిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.