
📌 Key Points
- ఉగాది నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం, ఇది సంపదను, ఆనందాన్ని ఇస్తుంది.
- ఎరుపు రంగు శక్తికి, ఉత్సాహానికి చిహ్నం. ఈ రంగు దుస్తులు వేసుకుంటే ఆనందం వెల్లివిరుస్తుంది.
- తెలుపు లేదా క్రీమ్ రంగులు ప్రశాంతతకు, పవిత్రతకు సంకేతం, వీటిని ధరించడం వలన సంవత్సరం ప్రశాంతంగా ఉంటుంది.
- కాషాయ రంగు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. ఇది శుభప్రదమైన రంగు, దీనిని ఉగాది నాడు ధరించవచ్చు.
ఉగాది పండుగ తెలుగువారికి ఒక ప్రత్యేకమైన రోజు. ఇది కొత్త సంవత్సరం ప్రారంభం. ఈ రోజున మనం చేసే కొన్ని పనులు మనకు మరియు మన కుటుంబానికి శుభాన్ని చేకూరుస్తాయి. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది పండుగ ప్రాముఖ్యత
కొత్త సంవత్సరం ఉగాది పండుగ నాడు ఈ రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ రంగులను ధరించడం వలన అనేక లాభాలను పొందవచ్చు. అభివృద్ధిని చూడచ్చు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. మరి ఆ రంగుల గురించి ఇప్పుడే చూసేద్దాం. ఉగాది తేదీ, సమయంతో పాటు తప్పక చేయాల్సినవి ఇవిగో.
కొత్త తెలుగు సంవత్సరంలో అన్ని బాగా కలిసి రావాలని చాలా మంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న వచ్చింది. ఉగాది నాడు చాలా మంది ఇష్ట దైవాన్ని ఆరాధించి ఆలయానికి వెళ్లి పూజ చేయించుకుంటారు. అలాగే ఉగాది నాడు ఉగాది పచ్చడి తిని అన్నింటినీ సమానంగా స్వీకరించాలని తెలుసుకుంటారు. ఉగాది నాడు కొన్ని రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. మరి ఉగాది నాడు ఏ రంగులు ధరిస్తే మంచిది? జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న విషయాలను వివరంగా తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం ఉగాది పండుగ నాడు ఈ రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఈ రంగులను ధరించడం వలన అనేక లాభాలను పొందవచ్చు. అభివృద్ధిని చూడచ్చు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. మరి ఆ రంగుల గురించి ఇప్పుడే చూసేద్దాం.
రంగుల యొక్క విశిష్టత
ఈ రంగులు ఉగాది నాడు విపరీతమైన అదృష్టంతో పాటు అనేక లాభాలను తీసుకొస్తాయి
పసుపు రంగు – పసుపు రంగు మంగళకరమైనది. ఏ పండుగ అయినా సరే చాలామంది పసుపును వాడతారు. అలాగే పసుపుతో వినాయకుడిని చేస్తాము. పసుపు అనేది ప్రతి పండుగకు ఎంతో ప్రత్యేకమైనది. సంపద , ఆనందం, ఆరోగ్యాన్ని ఇది తీసుకువస్తుంది. ఉగాది నాడు పూజలు చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులను ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
ఎరుపు రంగు – ఎరుపు రంగు శక్తి, ఉత్సాహానికి ప్రతీక. ఉగాది పండుగ నాడు ఈ రంగు దుస్తులను ధరిస్తే ఆనందం, ఉత్సాహం పెరుగుతుంది.
ఉగాది రోజు చేయవలసిన పనులు
తెలుపు లేదా క్రీమ్ కలర్ – ఈ రంగులు ప్రశాంతతను సూచిస్తాయి. పవిత్రతను తెలుపుతాయి. పరాభవ సంవత్సరం బాగా కలిసి రావాలని, ప్రశాంతంగా ఈ ఏడాదిని ప్రారంభించాలనుకునే వారు ఈ దుస్తులను ధరించడం మంచిది.
కాషాయ రంగు – కాషాయ రంగు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. చాలా మంది దేవాలయాలను సందర్శించేటప్పుడు, ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఈ రంగును ధరిస్తారు. ఇది కూడా శుభప్రదమైన రంగు. ఉగాదినాడు ధరించవచ్చు.
ఉగాది తేదీ, సమయంతో పాటు తప్పక చేయాల్సినవి ఇవిగో:
ఈ ఉగాది మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను, సిరిసంపదలను ప్రసాదించాలని కోరుకుంటూ శుభం భూయాత్.


