
📌 Key Points
- బ్రిటన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, గేమింగ్ యాప్‌లపై నిషేధం.
- ప్రధాని కీర్ స్టార్మర్ పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు.
- ఈ బిల్లును క్రిస్మస్ లోపు ప్రవేశపెట్టి 2027 నుండి అమలు చేయాలని యోచన.
- యుగవ్ సర్వేలో 74% మంది, తల్లిదండ్రుల్లో 90% మంది ఈ నిషేధాన్ని సమర్థించారు.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై పూర్తి నిషేధం విధించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తోంది.
బ్రిటన్ ప్రధాని సంచలన నిర్ణయం
టీనేజ్ పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే విషయంలో ఆస్ట్రేలియా బాటలో మరో దేశం సిద్ధమైంది. బ్రిటన్ 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా పూర్తి నిషేధం విధించనున్నట్లు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాని స్టార్మర్ మాట్లాడుతూ.. మన పిల్లల భద్రత, సంతోషం విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అందుకే ఈ నిషేధం అమలు చేస్తున్నామని పిల్లల రక్షణే మా మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
ఈ కొత్త ఆంక్షలకు సంబంధించిన బిల్లును క్రిస్మస్ పండుగకు ముందే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం 2027 ప్రారంభం నుండి ఈ నిషేధాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్ననట్లు సమాచారం. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పాటు గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, లైవ్‌స్ట్రీమింగ్ యాప్‌లకు కూడా ఈ ఆంక్షలు వర్తించేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక బ్రిటన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం పట్ల ప్రజా మద్దతు లభిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా పిల్లలకు జరుగుతున్న నష్టాలపై బ్రిటన్ ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో, ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి పెరిగింది. ఇటీవల ‘యుగవ్’ (YouGov) సర్వేలో 74 శాతం మంది బ్రిటన్ ప్రజలు ఈ నిషేధాన్ని సమర్థించారు. ఇక ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 1.16 లక్షల మంది తల్లిదండ్రులు, నిపుణులు స్పందించగా వారిలో 90 శాతం మంది తల్లిదండ్రులు 16 ఏళ్ల వయస్సు పరిమితిని స్వాగతించారు. కాగా ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు వారు టిక్‌టాక్, ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్‌చాట్ మరియు థ్రెడ్స్ వంటి ప్రధాన సోషల్ మీడియా సేవలను ఉపయోగించకుండా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
నిషేధానికి కారణాలు, ప్రజా మద్దతు
ఆస్ట్రేలియా బాటలో బ్రిటన్ అడుగులు
పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్ ప్రమాదాల నుండి పిల్లలను రక్షించడంలో ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


