
📌 Key Points
- వెంకటేష్ మాస్ నుండి ఫ్యామిలీ సినిమాలకు మారినా, బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నారు.
- బాలకృష్ణ పౌరాణిక చిత్రాలు, మాస్ సినిమాలతో పోటీ పడి నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు.
- కలిసుందాం రా, ఎఫ్2 వంటి చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచి వెంకీ సత్తా చాటాయి.
- 2025 సంక్రాంతికి కూడా బాలయ్య ‘డాకు మహారాజ్’పై వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ పైచేయి సాధించింది.
విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో అద్భుత విజయాలు సాధించారు. బాలకృష్ణ వంటి మాస్ హీరోతో బాక్సాఫీస్ వద్ద నాలుగు సార్లు తలపడి, తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. వారిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన పోటీల వివరాలు ఇప్పుడు చూద్దాం.
వెంకటేష్ కెరీర్ మలుపు: ఫ్యామిలీ హీరోగా మారినా..
విక్టరీ వెంకటేష్ తన కెరీర్ బిగినింగ్ లో మాస్ సినిమాలు ఎక్కువగా చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ జోనర్ కి వెంకీ మారారు. ఈ మార్పు వెంకటేష్ కి బాగా కలసి వచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు మాస్ సినిమాలు చేస్తుండడంతో.. వెంకటేష్ తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ఫ్యామిలీ సినిమాలు చేస్తున్నాడని వెంకీ బాక్సాఫీస్ స్టామినాని తక్కువగా అంచనా వేస్తే పొరపాటే. అలా వెంకీతో పోటీ పడి బాలయ్య లాంటి మాస్ హీరో 4 సార్లు చిత్తైపోయాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
బాలకృష్ణ తన కెరీర్ లో కొన్ని సార్లు పౌరాణిక చిత్రాలతో ప్రయోగాలు చేశారు. కానీ తన తండ్రి ఎన్టీఆర్ స్థాయిలో బాలయ్యకి విజయాలు దక్కలేదు. 1996 మే 16న సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున విజయము రిలీజ్ అయింది. అంచనాలని అందుకోలేక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఈ చిత్రానికి వారం తర్వాత విడుదలైన వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
బాలకృష్ణ వర్సెస్ వెంకటేష్: తొలి బాక్సాఫీస్ పోరు
2000 సంవత్సరం సంక్రాంతికి జనవరి 14న బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు, వెంకటేష్ నటించిన కలిసుందాం రా రిలీజ్ అయ్యాయి. ఒకే రోజు రిలీజ్ కావడంతో అటు వెంకీ, ఇటు బాలయ్య అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ వంశోద్ధారకుడు ఫ్లాప్ కాగా.. వెంకటేష్ కలిసుందాం రా మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది.
మరోసారి వీరిద్దరూ 2019 సంక్రాంతికి పోటీ పడ్డారు. జనవరి 9న బాలకృష్ణ నటించిన తన తండ్రి బయోపిక్ చిత్రం ఎన్టీఆర్ కథానాకుడు రిలీజ్ అయింది. బాలయ్య ఎంతో ఇష్టపడి ఈ చిత్రం చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది. జనవరి 12న రిలీజైన వెంకటేష్ ఎఫ్ 2 చిత్రం సంచలనంగా 100 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది.
సంక్రాంతి సమరంలో వెంకీదే పైచేయి
ఈ ఏడాది 2025 సంక్రాంతికి మరోసారి బాలయ్య, వెంకీ మధ్య బాక్సాఫీస్ వార్ జరిగింది. బాలయ్య నటించిన మాస్ యాక్షన్ మూవీ డాకు మహారాజ్ జనవరి 12న విడుదలైంది. ఈ మూవీ మంచి విజయమే సాధించింది. బిగినింగ్ లో కలెక్షన్స్ బాగా వచ్చాయి. 2 రోజుల గ్యాప్ లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14న రిలీజ్ అయింది. నెమ్మదిగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు పెంచుతూ సంచలన విజయం గా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జోరుతో డాకు మహారాజ్ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. డాకు మహారాజ్ హిట్ కాగా.. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా దాదాపు 300 కోట్ల గ్రాస్ రాబట్టింది.
జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తోనే ఎలాంటి మాస్ హీరోలని అయినా చిత్తు చేయగలనని చాలా సందర్భాల్లో వెంకటేష్ ప్రూవ్ చేశారు.
వెంకటేష్ తన కెరీర్ బిగినింగ్ నుండి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తోనే భారీ విజయాలు సాధిస్తూ వస్తున్నారు. బాలకృష్ణ లాంటి మాస్ హీరోలకు కూడా సవాల్ విసిరి, బాక్సాఫీస్ వద్ద తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ పోటీలు తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.


