|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్‌లో 463 కోట్ల హారర్ థ్రిల్లర్ ‘అంటిల్ డాన్’.. తెలుగులోనే స్ట్రీమింగ్.. అదిరిపోయే ట్విస్టులు, భయపెట్టే సీన్లు

Published: 27-07-2025, 8:15 PM
ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్‌లో 463 కోట్ల హారర్ థ్రిల్లర్ 'అంటిల్ డాన్'.. తెలుగులోనే స్ట్రీమింగ్.. అదిరిపోయే ట్విస్టులు, భయపెట్టే సీన్లు

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎంతో డిమాండ్ ఉంది. తాజాగా విడుదలైన ‘అంటిల్ డాన్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. 463 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం…

Key Points

1

463 కోట్లతో రూపొందిన 'అంటిల్ డాన్' సినిమా ఓటీటీలో టాప్ 1 ట్రెండింగ్‌లో!

2

నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో సహా 7 భాషల్లో స్ట్రీమింగ్!

4

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఓటీటీలోనూ సత్తా చాటుతోంది!

‘అంటిల్ డాన్’ సినిమా విజయం

ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. డిఫరెంట్ కంటెంట్‌తో భయపెట్టే సీన్లు, థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగే హారర్ మూవీస్ అంటే ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టం చూపిస్తుంటారు. అందుకే అవి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయి. ఇక వీటికి అదనంగా మరికొన్ని అంశాలు యాడ్ చేసి తెరకెక్కిస్తే మరింతగా రచ్చ చేస్తుంటాయి.

అలా రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన న్యూ హారర్ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతోంది. ఏకంగా టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్‌లో సత్తా చాటుతోంది. ఆ సినిమానే అంటిల్ డాన్ (Until Dawn). సాయంత్రం వరకు అనే అర్థం వస్తుంది. ఈ సినిమాను హారర్ అంశాలతో పాటు సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.

అమెరికన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన అంటిల్ డాన్ మూవీ ఏప్రిల్ 25న యూనైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు రెస్పాన్స్ విపరీతంగా వచ్చింది. కానీ, ఐఎమ్‌డీబీ రేటింగ్ మాత్రం పదికి 5.8 మాత్రమే సొంతం చేసుకుంది. అలాగే, 53 శాతమే ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ వచ్చింది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

కానీ, ఇలాంటి అంటిల్ డాన్ సినిమా మాత్రం కలెక్షన్ల మోత మోగించింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 129.69 కోట్లతో రూపొందిన అంటిల్ డాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 463.09 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాంటి అంటిల్ డాన్ ఓటీటీలోకి 3 నెలల తర్వాత స్ట్రీమింగ్‌కు వచ్చింది.

జూలై 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో అంటిల్ డాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, పోలిష్, స్పానిష్, తమిళ్, తెలుగు, థాయి వంటి 7 భాషల్లో అంటిల్ డాన్ ఓటీటీ రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ సినిమాల్లో చోటు సంపాదించుకుని సత్తా చాటింది అంటిల్ డాన్ మూవీ.

అద్భుతమైన ప్రతిస్పందన

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల జాబితాలో టాప్ 1 ప్లేసులో దూసుకుపోతోంది అంటిల్ డాన్ మూవీ. సినిమాలో ఊహించని థ్రిల్లింగ్ ట్విస్టులు, భయపెట్టే సీన్స్, హారర్ ఎలిమెంట్స్‌ ఉండటంతో అంటిల్ డాన్‌కు ఓటీటీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

హారర్ తరహా ఉండే చిత్రాలను పంపిణీ చేసే సంస్థ స్క్రీన్ జెమ్స్ అంటిల్ డాన్ మూవీని సోనీ పిక్చర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమాకు డేవిడ్ ఎఫ్ సాండ్‌బర్గ్ దర్శకత్వం వహించారు. ప్లే స్టేషన్ స్టూడియోస్ వారి అంటిల్ డాన్ అనే గేమ్ ఆధారంగా ఈ సినిమాను అదే టైటిల్‌తో తెరకెక్కించారు.

మొత్తంమీద, ‘అంటిల్ డాన్’ సినిమా ఓటీటీలోనూ తన సత్తా చాటుకుంటోంది. భయానక సన్నివేశాలు, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.