|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యూపీలో దారుణం: జర్నలిస్టును కిడ్నాప్ చేసి సజీవ దహనానికి యత్నం.. పెళ్లి ఊరేగింపుతో బయటపడ్డ నిజం!

Published: 10-05-2026, 6:31 AM
యూపీలో దారుణం: జర్నలిస్టును కిడ్నాప్ చేసి సజీవ దహనానికి యత్నం.. పెళ్లి ఊరేగింపుతో బయటపడ్డ నిజం!
  • యూపీలోని మీర్జాపూర్‌లో మహిళా జర్నలిస్టు సరితా పటేల్‌ను కిడ్నాప్ చేశారు.
  • దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు.
  • పెట్రోల్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించగా, పెళ్లి ఊరేగింపు రావడంతో పారిపోయారు.
  • రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళా జర్నలిస్టును కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్యాయత్నం చేశారు. పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించగా, పెళ్లి ఊరేగింపు రావడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన యూపీలో జర్నలిస్టుల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది.

జర్నలిస్టు కిడ్నాప్: అసలేం జరిగింది?

యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ జ‌ర్న‌లిస్టు, యూట్యూబ‌ర్ ను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హ‌తమార్చాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ ఘ‌ట‌న మీర్జాపూర్ లో చోటు చేసుకుంది. మీర్జాపూర్ లో స‌రితా ప‌టేల్ అనే మ‌హిళా జ‌ర్న‌లిస్టు, యూట్యూబ‌ర్ ఏప్రిల్ 30 నుండి కనిపించ‌కుండా పోయింది. ఆమెను కొంత‌మంది దుండ‌గులు కిడ్నాప్ చేసి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దాడి చేశారు. ఆమె నోరు, కాళ్లు, చేతులు క‌ట్టేసి తీవ్రంగా గాయ‌ప‌ర్చారు. అనంత‌రం ఆధారాలు దొర‌క‌కుండా పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టే ప్లాన్ చేశారు.

కానీ ఇంత‌లోనే ఓ పెళ్లి భార‌త్ అక్క‌డి రావ‌డంతో దొరికిపోతామేమో అనే భ‌యంతో అక్క‌డ నుండి ప‌రుగులు తీశారు. స్థానికులు స్పృహ‌కోల్పోయి ఉన్న మ‌హిళా జ‌ర్న‌లిస్టును చూసి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా ప్ర‌స్తుతం చికిత్స పొందుతోంది. ఇక యూపీలో ఇలా జ‌ర్న‌లిస్టులు మిస్ అయిన ఘ‌ట‌న‌లు దాదాపు 20 వ‌ర‌కు జ‌రిగి ఉంటాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మ‌ పార్టీల‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తున్నార‌ని జ‌ర్న‌లిస్టుల‌ను కిడ్నాప్ చేసి వారిని క‌నిపించ‌కుండా చేస్తున్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

పెళ్లి ఊరేగింపుతో ప్రాణాపాయం నుండి రక్షణ

యూపీలో జర్నలిస్టులపై దాడుల వెనుక రాజకీయ కోణం

యూపీలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలి. మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.