|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Upasana Konidela: వారసత్వం, పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు.. ఎన్నోసార్లు పడుతూ లేచా..

Published: 25-08-2025, 7:26 AM
Upasana Konidela: వారసత్వం, పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు.. ఎన్నోసార్లు పడుతూ లేచా..

రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదెల తన విజయం వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించింది. వారసత్వం లేదా పెళ్లి వల్ల కాదు, కష్టపడి, పడి లేచి, స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకుందని ఆమె తెలిపింది.

Key Points

1

ఉపాసన తన విజయం వారసత్వం లేదా పెళ్ళి వల్ల కాదని స్పష్టం చేసింది.

2

ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, పడి లేచి నిలబడింది.

4

సమాజం ఆడవారిని అణచివేస్తుందని, కానీ ఆమె అలాంటి అవరోధాలను అధిగమించిందని చెప్పింది.

వారసత్వం కాదు, స్వశక్తితోనే ఎదిగాను

‘వారసత్వం వల్లో, నేను ఒకరిని పెళ్లి చేసుకోవడం వల్లో ఈ స్థాయికి రాలేదు, నా స్వశక్తితో ఎదిగాను’ అంటోంది రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ( Upasana Kamineni Konidela ). ‘ద ఖాస్‌ ఆద్మీ’ పార్టీ పేరిట తన ఆలోచనలను సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. సంపద, హోదా, విజయం, పాపులారిటీ.. ఏది మనల్ని గొప్పవారిని చేస్తుంది? అంతర్గత లక్షణాలైన భావోద్వేగాలపై స్పష్టత, ఇతరులకు సాయం చేసే గుణం గొప్పవారిని చేస్తాయా? దీనికి ఎక్కడా సరైన సమాధానం ఉండదు. ఎవరికి వారే తమలోనే సమాధానం వెతుక్కోవాలి. నిన్ను నువ్వు నమ్మడం, నిన్ను నువ్వు ప్రేమించి, నీకంటూ విలువ ఇచ్చుకోవడం అన్నింటికన్నా ముఖ్యం అని నా అభిప్రాయం.

సమాజం ప్రోత్సహించదు సమాజం ఎప్పుడూ ఆడవారిని వినయంతో మసులుకోమనే చెప్తుంది. ఏదైనా సరే.. మనవంతు వచ్చేవరకు ఆగమంటుంది. నిస్వార్థంగా ఉండటమే మంచిదని చెప్తుంది. పెద్ద కలలు కనేందుకు ఎంకరేజ్‌ చేయదు. మనం ఎదగడానికి ప్రోత్సహించదు. అయినా నేను మంచి స్థాయిలో నిలబడ్డాను. దీనికి నా కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం కారణం కాదు. అలాగే రామ్‌చరణ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ నిలబడలేదు. ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే ఎంతో ఒత్తిడి, బాధ అనుభవించాను.

ఎన్నో సవాళ్లు, ఎన్నో పతనాలు, ఎన్నో లేవడాలు

కిందపడ్డ ప్రతిసారి లేచా.. ఎలాగైనా సరే, జీవితంలో ఎదగాలని తాపత్రయపడ్డాను, పాటుపడ్డాను. కొన్నిసార్లు నాపై నాకే అనుమానం వేసేది. కిందపడ్డ ప్రతిసారి మళ్లీ లేచి నా ప్రయాణాన్ని ప్రారంభించాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. అసలైన బలం ఆత్మగౌరవంలోనే ఉంది. దానికి డబ్బు, హోదా, కీర్తితో సంబంధం లేదు. అహంకారం గుర్తింపును కోరుతుంది. కానీ ఆత్మగౌరవం.. నిశ్శబ్ధంగా గుర్తింపును సృష్టిస్తుంది అని ఉపాసన రాసుకొచ్చింది.

ఆత్మగౌరవం: నిజమైన బలం

చివరగా, ఉపాసన తన జీవిత విజయానికి ఆత్మగౌరవం, కష్టపాటు కీలకమని వివరించింది. సమాజం విధించే నియమాలను అధిగమించి, స్వశక్తితో ఎదిగిన తన అనుభవాన్ని పంచుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.