
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన కమిని ప్రేమకథ అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఉపాసన, చరణ్ తో డేటింగ్ రోజుల్లో జరిగిన వినోదాత్మక ఘటనను పంచుకుంది. ఆమె చరణ్ కి పెట్టిన లవ్ టెస్ట్ గురించి వివరించింది.
Key Points
రామ్ చరణ్, ఉపాసన డేటింగ్ రోజుల్లో ఉపాసన పెట్టిన లవ్ టెస్ట్ ఏమిటో తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ఐస్ క్రీం షాప్ కి చరణ్ ని తీసుకెళ్లమని ఉపాసన అడిగింది.
చరణ్ స్టార్ అయినప్పటికీ, అభిమానుల మధ్యన ఐస్ క్రీం తిన్నారు.
ఈ ఘటన వారి ప్రేమకు నిదర్శనంగా ఉపాసన చెప్పింది.
ఉపాసన రామ్ చరణ్ లవ్ టెస్ట్
Upasana : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ క్యూట్ కపుల్స్ లో చరణ్ – ఉపాసన జంట ఒకరు. ఉపాసన బిజినెస్ రంగంలో దూసుకుపోతుంది. చరణ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన బిజినెస్, ఫ్యామిలీ అప్డేట్స్ ఇస్తూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన.
తాజాగా ఉపాసన ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో చరణ్ కి ఓ లవ్ టెస్ట్ పెట్టానని చెప్పుకొచ్చింది.
డేటింగ్ రోజుల్లో హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ఐస్ క్రీం షాప్
ఉపాసన మాట్లాడుతూ.. పెళ్ళికి ముందు డేటింగ్ చేసేటప్పుడు చరణ్ ని నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తే ‘ఫేమస్ ఐస్ క్రీం’ షాప్ కి తీసుకువెళ్ళు అని అడిగా. ఓల్డ్ సిటీ మొజంజాహి మార్కెట్ లో ఫేమస్ ఐస్ క్రీం షాప్ ఉంటుంది. అక్కడ ఐస్ క్రీం బాగుంటుంది. నా ఫేవరేట్. హైదరాబాద్ లో ఉన్న ఓల్డెస్ట్ ఐస్ క్రీం షాప్స్ లో అది ఒకటి. అది మార్కెట్ మిడిల్ లో ఉంటుంది. అప్పటికే చరణ్ స్టార్. అందరూ గుర్తుపడతారు. అయినా నేను అడిగానని ఓకే చెప్పి నన్ను తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లి నాకు ఐస్ క్రీం ఆర్డర్ చేసాడు. అక్కడ ఉన్న జనాలు చరణ్ ని చూసి మమ్మల్ని చుట్టుముట్టేశారు. నేను అతనికి పెట్టిన నిజమైన లవ్ టెస్ట్ అదే. ఆ తర్వాత రేర్ గా పలుమార్లు వెళ్ళాము అక్కడికి అని తెలిపింది.
చరణ్ – ఉపాసన ప్రేమ కథ
ఉపాసన తెలిపిన ఈ విషయం చరణ్ – ఉపాసన జంట ప్రేమకు మరో ఆధారం. సాధారణ ప్రదేశంలో గడిపిన సమయం వారి బంధాన్ని మరింత బలపరిచింది.


