|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన.. పోస్ట్ వైరల్.. చిన్ని తల్లి ఎంత క్యూట్‌గా ఉందో..

Published: 20-06-2025, 2:00 AM
మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన.. పోస్ట్ వైరల్.. చిన్ని తల్లి ఎంత క్యూట్‌గా ఉందో..

మెగాస్టార్ చరణ్ భార్య ఉపాసన తన కూతురు క్లీంకార ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా, అందరూ క్లీంకార క్యూట్‌నెస్‌ను ప్రశంసిస్తున్నారు.

Key Points

1

ఉపాసన క్లీంకార ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

2

క్లీంకార పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్ట్ పెట్టారు.

4

క్లీంకార చాలా క్యూట్‌గా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఉపాసన క్లీంకార ఫోటోలు

టాలీవుడ్‌ స్టార్‌ నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) సతీమణి, మెగా కోడలు ఉపాసన (Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు పాప క్లీంకార ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఆ ప్రిన్సెస్ ఫేస్‌ను రివీల్ చేస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈరోజు క్లీంకార పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సతీమణి తన ఇన్‌స్టాలో తన కూతురికి స్పెషల్ విషెస్ తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో జూపార్కులో తన గారాల పట్టితో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘ఒక సంవత్సరం క్రితం, అది కేవలం ఒక చిన్న పులి.

వైరల్ అయిన పోస్ట్

నేడు, అది ఒక ఉల్లాసభరితమైన పులి. అయితే అది మా క్లింకారతో తన పేరును పంచుకుంటుంది. ఈ అందమైన సంజ్ఞకు హైదరాబాద్ జూకు ధన్యవాదాలు. వన్యప్రాణులు అడవిలోనే ఉన్నాయని మేము నమ్ముతున్నాము, కానీ వాటి జీవితాలను గౌరవంగా మరియు జాగ్రత్తగా గౌరవించే ప్రయత్నాలకు కూడా మద్దతు ఇస్తాము. దయ, ధైర్యం మరియు కరుణతో పెరగడం ఇక్కడ ఉంది’ అని రాసుకొచ్చింది. అయితే ఈ పిక్స్‌లో క్లీంకార ఫేస్ కొంచెం రివీల్ అయింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. కారా చిట్టి తల్లికి అందరూ బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఎంత క్యూట్‌గా ఉందో చిన్ని తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అభిమానుల స్పందన

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

చిన్నారి క్లీంకార ఫోటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉపాసన పోస్ట్ వైరల్‌గా మారడంతో, మెగా ఫ్యామిలీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.