|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Upasana: వారసత్వాన్ని కాపాడుకునే వేడుక అంటూ స్పెషల్ వీడియో షేర్ చేసిన మెగా కోడలు ఉపాసన

Published: 01-05-2025, 8:49 AM
Upasana: వారసత్వాన్ని కాపాడుకునే వేడుక అంటూ స్పెషల్ వీడియో షేర్ చేసిన మెగా కోడలు ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, తన అత్త సురేఖతో కలిసి ఆవకాయ పచ్చడి చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో వారిద్దరూ సంప్రదాయ పద్ధతిలో పచ్చడి తయారు చేయడం చూడవచ్చు.

Key Points

1

ఉపాసన ట్విట్టర్‌లో స్పెషల్ వీడియో షేర్ చేశారు.

2

అత్తా సురేఖతో కలిసి ఆవకాయ పచ్చడి తయారు చేశారు.

4

ఆర్డర్ చేయమని ఉపాసన అభ్యర్థన.

ఉపాసన వీడియోలో ఏముంది?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సతీమణి ఉపాసన (Upasana)సినిమాల్లో నటించనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నిత్యం సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే తన అపోలో హాస్పిటల్ ద్వారా ఎంతోమంది తనవంతు సహాయం అందిస్తుంది. అలాగే మెగా అభిమానులు దగ్గరగా ఉంటుంది. ఇక ఇటీవల ఉపాసన తన అత్త సురేఖతో పచ్చళ్ల బిజినెస్‌ను కూడా పెట్టించింది. నిత్యం ఈ బిజినెస్‌కు సంబంధించిన విషయాలను తెలుపుతోంది. తాజాగా, ఉపాసన ట్విట్టర్ ద్వారా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో అత్తా కోడళ్లు అవకాయ పచ్చడిని పెట్టారు.

చక్కగా అవకాయ కలిపి జాడిలో పెట్టడమే కాకుండా సంప్రదాయంగా కొత్త పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి పూజ కూడా చేశారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘సురేఖ(Surekha) గారు అలియాస్ నా ప్రియమైన ఆతమ్మ – ఈ సీజన్ ఆవకాయ పచ్చడితో నిజంగానే అందరినీ అలరించింది. ఆహారం అంటే పోషకాహారం మాత్రమే కాదు – ఇది సంస్కృతి & వారసత్వాన్ని కాపాడుకునే మార్గం’’ అని రాసుకొచ్చింది. అలాగే ఆర్డర్ చేసుకోవాలని కోరింది. ఇక అది చూసిన నెటిజన్లు తెలివైన కోడలు తమ వ్యాపారం లాభాలు పొందాలని కోరుకున్నట్లుంది అని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా అత్తా కోడలు అనుబంధం ఇలా ఉండాలని ప్రశంసలు కురిపిస్తున్నారు.

అత్తా-కోడళ్ల మధ్య అనుబంధం

వారసత్వం మరియు ఆహారం

చివరగా, ఉపాసన తన అత్తాతో కలిసి చేసిన ఈ పచ్చడి తయారీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారసత్వాన్ని కాపాడుకోవడంపై ఆమె దృష్టిని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.