
2021లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఉప్పెన సినిమా బడ్జెట్ గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కొత్త నటీనటులు, దర్శకుడితో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ. 22 కోట్లు ఖర్చవడం, ఆ తర్వాత వంద కోట్లకు పైగా వసూలు చేయడం వెనుక ఉన్న కథను ఈ కథనంలో తెలుసుకోండి.
Key Points
కొత్త నటీనటులు, దర్శకుడితో ఉప్పెన సినిమాకు రూ. 22 కోట్ల బడ్జెట్ అయింది.
మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ బడ్జెట్ పెరగడంపై దర్శకుడు బుచ్చిబాబుకు కాల్ చేశారు.
సినిమాలోని పాటలు ముందుగానే పెద్ద హిట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
కరోనా తర్వాత వచ్చి ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ అయింది.
ఉప్పెన భారీ బడ్జెట్‌కు కారణం ఏంటి?
Uppena : కరోనా తర్వాత 2021లో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హీరో – హీరోయిన్, దర్శకుడు అందరూ కొత్తవాళ్లే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక్కరే కాస్త ఫేమ్ ఉన్న యాక్టర్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.(Uppena)
అసలు అందరూ కొత్తవాళ్లను పెట్టి కరోనా సమయంలో సినిమా అంటే ఎంత తక్కువలో తీస్తారు. కానీ ఉప్పెన సినిమాకు భారీగానే బడ్జెట్ అయింది.
దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాలు
తాజాగా ఓ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. నేను మైత్రీ మూవీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసాను. తర్వాత ఉప్పెనతో డైరెక్టర్ అయ్యాను. ఉప్పెన టైంలో నేను ఎవరో తెలీదు, వైష్ణవ్, కృతి ఎవరో తెలీదు. కానీ మా మీద బాగా బడ్జెట్ పెట్టారు. ఎంత బడ్జెట్ అవుతున్నా ఏమనలేదు. ఓ రోజు నవీన్ గారు అమెరికా నుంచి కాల్ చేసి బుచ్చి నీకు అర్ధమవుతుందా 20 కోట్లు దాటిపోతుంది బడ్జెట్ అని అన్నారు. నేను అవునా సర్ అన్నాను అంతే. ఒక్క మాట కూడా అనలేదు ఆయన. మమ్మల్ని నమ్మారు. అంతలా సపోర్ట్ చేసారు అని తెలిపాడు.
22 కోట్ల బడ్జెట్, 100 కోట్ల వసూళ్లు: ఎలా సాధ్యం?
అయితే ఉప్పెన సినిమాకు మొత్తం 22 కోట్ల బడ్జెట్ అయింది. ఆ సినిమాలో సాంగ్స్ ముందే పెద్ద హిట్ అవ్వడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కరోనా తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ రావడంతో జనాలు కూడా థియేటర్స్ కి వెళ్లి చూసారు. ఈ సినిమా ఏకంగా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది. అయితే ఇంతమంది కొత్తవాళ్ళ మీద ఏకంగా 22 కోట్లు బడ్జెట్ పెట్టడం ఆశ్చర్యకర విషయమే. ఆ సమయంలో 22 కోట్లు కొత్తవాళ్ళ మీద బడ్జెట్ అంటే చాలా ఎక్కువే, రిస్క్ కూడా.
కొత్తవారిని నమ్మి మైత్రీ మూవీ మేకర్స్ పెట్టిన భారీ బడ్జెట్, దర్శకుడు బుచ్చిబాబు విజన్, పాటల విజయం ఉప్పెనను అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌గా మార్చింది. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక సాహసోపేతమైన, విజయవంతమైన ప్రయోగంగా నిలిచింది.


