|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రపంచ యుద్ధానికి అమెరికా-ఇజ్రాయెల్ కారకులేనా? ఇరాన్ సంచలన ఆరోపణలు!

Published: 03-03-2026, 8:35 AM
ప్రపంచ యుద్ధానికి అమెరికా-ఇజ్రాయెల్ కారకులేనా? ఇరాన్ సంచలన ఆరోపణలు!
  • యుద్ధాన్ని తాము మొదలుపెట్టలేదని, అమెరికా, ఇజ్రాయెల్లే కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
  • అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందని ఇరాన్ అభిప్రాయపడింది.
  • ఇరాన్‌పై దాడికి గల కారణాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వివరించారు.
  • తమ సైనికులను కాపాడుకునేందుకే ఇరాన్‌పై ముందస్తు దాడి చేశామని అమెరికా సమర్థించుకుంది.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. తమపై అమెరికా, ఇజ్రాయేల్లే యుద్ధం ప్రారంభించాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ వివాదం ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

యుద్ధం మొదలుపెట్టింది అమెరికా, ఇజ్రాయేలే: ఇరాన్

యుద్ధంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి(Esmail Baghai) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేము యుద్ధం ఏనాడూ కోరుకోలేదు. అసలు యుద్ధమే మేము ప్రారంభించలేదు. ఇజ్రాయెల్ – అమెరికా కలిసి తమపై యుద్ధాన్ని ప్రకటించాయి. వాళ్లే మొదలెట్టారు.. కాబట్టి వాళ్లే ఆపేయాలి. మేము ఎప్పుడూ దౌత్య మార్గమే ఎంచుకున్నాము. అమెరికా – ఇజ్రాయెల్ రగిలించిన అగ్రి ఇప్పుడు ప్రపంచమంతా కమ్మేస్తోంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అంతర్జాతీయ సమాజం మధ్యవర్తిత్వం వహిస్తే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం సులభమే. మరోవైపు యూరప్ వైఖరి కూడా సరిగా లేదు. యూరల్ దేశాల నిర్లక్ష్య వైఖరి వీడాలి. దాడులను యూరప్ దేశాలు ఖండించాలి. దీనికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC) బాధ్యత తీసుకోవాలి’ అని ఇస్మాయిల్ బఘాయి పేర్కొన్నారు.

మరోవైపు ఇరాన్‌పై దాడికి గల కారణాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో విశ్లేషించారు. “ఇజ్రాయెల్ దాడి చేయబోతోందని మాకు తెలుసు. ఆ దాడి జరిగిన వెంటనే ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బలగాలపై ప్రతీకార దాడులకు దిగుతుందని మా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఒకవేళ మేము ముందే అప్రమత్తమై వారి క్షిపణి వ్యవస్థలను దెబ్బ తీయకపోతే.. మా సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. అందుకే ఎదురుదెబ్బ తినడం కంటే ముందే శత్రువును దెబ్బకొట్టాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అత్యంత తెలివైనది” అని ఆయన పేర్కొన్నారు.

పరిస్థితి అదుపులోకి రావాలంటే..?

ఇరాన్‌పై దాడికి అమెరికా సమర్థన

అమెరికా మరియు ఇజ్రాయెల్ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.