
కార్తీక మాసం దీపారాధనకు ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ఉసిరి దీపానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఉసిరి దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు, పురాణాల ప్రకారం దాని ప్రయోజనాలేమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Key Points
కార్తీక మాసం అంటే దీపారాధన, ముఖ్యంగా ఉసిరి దీపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
శివ పురాణం ప్రకారం, ఉసిరి చెట్టు శివస్వరూపం; దీని కింద దీపం పెడితే కష్టాలు తొలగిపోతాయి.
కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం వెలిగిస్తే మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
ఉసిరి దీపారాధన నవగ్రహ దోషాలను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు.
కార్తీక మాసంలో ఉసిరి దీపం ప్రాముఖ్యత
కార్తీక మాసం అంటే మనకి గుర్తు వచ్చేది దీపారాధన. ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసంలో శైవక్షేత్రాలు భక్తులతో కళకళ్ళాడతాయి. కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఆలయంలో ఉసిరి దీపాలను చూడొచ్చు. ఉసిరి దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? ఉసిరి దీపానికి కార్తీక మాసానికి సంబంధం ఏంటి?
కార్తీక మాసం అంటే మొట్టమొదట మనకి గుర్తు వచ్చేది దీపారాధన. అందులోనూ ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం తింటే కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. అలాగే కార్తీక మాసంలో పిండి దీపాలు, కొబ్బరికాయలతో ఐశ్వర్య దీపం- ఇలా ఎవరికి నచ్చిన పద్ధతుల్ని వారు పాటిస్తూ ఉంటారు.
ఉసిరి దీపం వెలిగించడం వెనుక కారణాలు
కార్తీక మాసంలో పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని, సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చని భావిస్తారు. కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఉన్న ప్రత్యేకత ఇంతా అంతా కాదు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. అయితే కార్తీకమాసంలో అసలు ఎందుకు ఉసిరి దీపాన్ని వెలిగించాలి? దాని వెనుక కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక మాసంలో ఎందుకు ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు?
ఉసిరి దీపారాధన ప్రయోజనాలు
శివ పురాణం ప్రకారం చూసినట్లయితే, కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివస్వరూపం అని భావిస్తారు. ఉసిరి చెట్టు కింద దీపం పెడితే సకల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపాన్ని పెడతారు. మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా ఉసిరి దీపాన్ని పెట్టడం వలన తొలగిపోతాయట.
కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల సకల కష్టాలు తొలగి, శివ, విష్ణువుల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. నవగ్రహ దోషాల నివారణకు ఇది అత్యంత శక్తివంతమైన సాధనంగా భక్తులు భావిస్తారు.


