|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ మామూలు రికార్డ్ కాదు.. బన్నీకి దిమ్మతిరిగే షాక్!

Published: 24-02-2026, 1:35 AM
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' మామూలు రికార్డ్ కాదు.. బన్నీకి దిమ్మతిరిగే షాక్!
  • పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ అదుర్స్!
  • శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా మెరుపులు, దేవిశ్రీప్రసాద్ సంగీతం!
  • మార్చి 26న గ్రాండ్ రిలీజ్! ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డుల వేట షురూ!!
  • ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ విడుదల: అల్లు అర్జున్ ‘పుష్ప’ రికార్డు బ్రేక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ వైరల్ అవుతోంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సాంగ్ రిలీజ్.. దుమ్మురేపింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. మార్చి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని ఆరా ఆఫ్ ఉస్తాద్ అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఈ సాంగ్ విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ ఈ సాంగ్ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అలాగే ఈ పాట విడుదల కోసం ఓ పెద్ద ఈవెంట్ను కూడా నిర్వహించారు.

దానితో పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ పై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లో 11.44 మిలియన్ వ్యూస్, 138k లైక్స్ ను సాధించింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సాంగ్కు మంచి రెస్పాన్స్ లభించినా భారీ స్థాయిలో రికార్డులను మాత్రం నెలకొల్పలేకపోయింది. కానీ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప పార్ట్ 2 మూవీకి సంబంధించిన సూసైకి సాంగ్ రికార్డును మాత్రం క్రాస్ చేసింది. సూసైకి పాటకి 24 గంటల్లో 10.97 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలా ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ పుష్పలోని సూసేకి సాంగ్ను దాటేసింది.

అల్లు అర్జున్ రికార్డుకు గండి కొట్టిన పవన్ కళ్యాణ్!

మార్చి 26న థియేటర్లలో ఉస్తాద్ భగత్ సింగ్ సందడి!

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.