|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ మాస్ ట్రీట్: మెడ అంటే ఇక అంతే! రికార్డులు బద్దలే!!

Published: 22-02-2026, 11:35 AM
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' మాస్ ట్రీట్: మెడ అంటే ఇక అంతే! రికార్డులు బద్దలే!!
  • పవన్ కళ్యాణ్ మేనరిజానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన హరీశ్ శంకర్!
  • ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాట విడుదల వేడుకలో అభిమానుల కేరింతలు, డ్యాన్సులు!
  • మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల!
  • శ్రీలీల, రాశీఖన్న అందాలతో సినిమాకు మరింత గ్లామర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో టాలీవుడ్ షేక్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ వైరల్ అవుతోంది. అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ పాట విడుదల!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ (Aura Of Ustaad) పేరిట హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా ఆదివారం రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) మేనరిజానికి ఈ పాట ద్వారా డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే’.. అని నిర్వచనం ఇచ్చారు. ప్రేక్షకుల్లో పవన్ కల్యాణ్‌కున్న క్రేజ్‌ను ప్రతిబింబించేలా చంద్రబోస్‌ రాసిన ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్‌, ఎస్పీ అభిషేక్‌ పాడారు. సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాదే అందించారు. మార్చి 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. శ్రీలీల, రాశీఖన్న హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. తమిళ నటులు పార్థిబన్, కెయస్ రవికుమార్ కీలక పాత్రల్లో మెరిశారు. ఎల్బీ శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కేజీఎఫ్ అవినాష్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

పవన్ కళ్యాణ్ మేనరిజానికి కొత్త నిర్వచనం

మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.