|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’: విడుదలకు ముందే బ్లాక్ బస్టర్.. రికార్డు స్థాయి బిజినెస్!

Published: 07-03-2026, 7:05 AM
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్': విడుదలకు ముందే బ్లాక్ బస్టర్.. రికార్డు స్థాయి బిజినెస్!
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీకి రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయింపు!
  • ఓటీటీ హక్కుల ద్వారా ఇప్పటికే రూ.80 కోట్ల రాబడి.. భారీ రికార్డ్!
  • థియేట్రికల్ బిజినెస్ ద్వారా మరో రూ.100 కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్న విశ్లేషకులు.
  • రెమ్యునరేషన్ లో రూ.20 కోట్లు తగ్గించుకున్న పవన్ కళ్యాణ్.. మైత్రి మూవీస్ కి అండగా నిలిచారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదల కాకముందే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఉస్తాద్ భగత్ సింగ్: భారీ అంచనాలతో బిజినెస్!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్- హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దీంతో, ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, విడుదలకు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అది సినిమా రిజల్ట్ విషయంలో కాదు.. కమర్షియల్ విషయాల పరంగా ఈ సినిమా ఇప్పటికే లాభాల బాట పెట్టినట్టుగా తెలుస్తోంది. అది కూడా రెండేళ్లు లేట్ గా రేలసే అవుతున్నప్పటికీ. ఈ విషయంలో మైత్రి సంస్థ వేసుకున్న పక్కా ప్లానింగ్ అనేది బాగా వర్కౌట్ అయిందని టాక్.

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ లో భారీ తగ్గింపు.. ఎందుకో తెలుసా?

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మొత్తంగా రూ.150 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓటీటీ హక్కుల ద్వారా రూ.80 కోట్ల వరకు వచ్చినట్టుగా తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ ద్వారా మరో రూ.100 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అప్పటికే ఇన్వెస్ట్మెంట్ లో సగం వరకు రికవరీ అయిపోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ముందు, రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నారు.

ఓటీటీ, థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీ లాభాలు!

కానీ, హరి హర వీరమల్లు సినిమా విడుదల సమయంలో మైత్రి సంస్థ ఆ చిత్ర నిర్మాతలకు అండగా నిలబడింది. ఆ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఏకంగా రూ.20 కోట్ల తక్కువ అంటే రూ.30 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడట పవన్ కళ్యాణ్. మొత్తంగా చూసుకుంటే రూ.200 కోట్ల ఆదాయం రావడంతో విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ లోకి వెళ్లారు మైత్రి మూవీ మేకర్స్. దీనికి వారు ముందు నుంచి వేసుకున్న పక్కా ప్రాణాలకే కారణం అని తెలుస్తోంది. మరి రిజల్ట్ పరంగా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మార్చి 19 వరకు ఆగాల్సిందే.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల ముందే భారీ లాభాల్లోకి చేరిపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది ఒక మైలురాయి కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.