
📌 Key Points
- ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు వసూళ్లలో భారీ పతనం!
- తొలి రోజు కలెక్షన్లకు రెండో రోజు కలెక్షన్లకు మధ్య భారీ వ్యత్యాసం
- ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.59 కోట్ల గ్రాస్ వసూళ్లు
- రంజాన్ సెలవుల్లో విడుదలైన ధురంధర్ 2 సినిమా ప్రభావంతో కలెక్షన్లు డౌన్!
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
రెండో రోజు వసూళ్లలో భారీ పతనం
Ustaad Bhagat Singh Box Office: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ధురంధర్ 2 సునామీ ప్రభావం పవన్ కల్యాణ్ సినిమాపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో రంజాన్ వీకెండ్ పైనే ఆ మూవీ ఆశలు పెట్టుకుంది.
Ustaad Bhagat Singh Box Office: పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు అదిరిపోయే వసూళ్లు సాధించినా.. రెండో రోజు అవి దారుణంగా పడిపోయాయి. రెండు రోజులు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.59 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో ఇది రూ.52 కోట్లుగా ఉంది.
దుమ్మురేపిన తొలిరోజు కలెక్షన్లు
ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు ఇలా..
Sacnilk.com రిపోర్టు ప్రకారం తొలి రోజు ఇండియాలో రూ.34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ పవన్ కల్యాణ్ మూవీ.. రెండో రోజు మాత్రం కేవలం రూ.9.25 కోట్లకే పరిమితమైంది. దీంతో రెండు రోజులు కలిపి ఇండియా నెట్ వసూళ్లు రూ.44 కోట్లకు చేరాయి. ఇక ఓవర్సీస్ నుంచి మరో రూ.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
వీకెండ్ పైనే ఆశలు పెట్టుకున్న మేకర్స్
అయితే అది కూడా అంత సులువుగా కనిపించడం లేదు. శనివారమే ధురంధర్ 2 తెలుగు వెర్షన్ కూడా వస్తోంది. ఇప్పటికే హిందీ వెర్షన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో ఉస్తాద్ వసూళ్లకు కాస్త గండి పడింది. ఏపీలో మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ తెలుగు వెర్షన్ కూడా వస్తుండటం ఉస్తాద్ భగత్ సింగ్ కు సవాలే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫస్ట్ వీకెండ్ ఉస్తాద్ ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఉస్తాద్ భగత్ సింగ్ వసూళ్ల పరిస్థితి ఇలా ఉండగా.. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ విధంగా కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


