
📌 Key Points
- ఉస్తాద్ భగత్ సింగ్ 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 54 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది – భారీ నష్టం!
- పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ కాలేదు – అభిమానులకు నిరాశ!
- సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి ఆలస్యం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది – ఇది ఒక ప్రధాన కారణం!
- దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకోలేకపోవడం ఉస్తాద్ కి పెద్ద దెబ్బ – పాటలు హిట్టు కాలేదు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మూవీ ఎందుకు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది?
ఉస్తాద్ ఫ్లాప్ అవ్వడానికి కారణాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ఇది. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంతా భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే బయ్యర్లకు దాదాపు అన్ని ఏరియాలలో నష్టాలు తప్పేలా లేవు.10 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 54 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. సెకండ్ వీకెండ్ కూడా ముగుస్తోంది కాబట్టి ఇక ఈ సినిమా కోలుకునే పరిస్థితి లేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన హరీష్, పవన్ కాంబోలో ఇలాంటి మూవీ వచ్చింది ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ పరాజయానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అవి ఇప్పుడు చూద్దాం.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నిరాశ పరచడానికి ప్రధాన కారణం ఏళ్ళ తరబడి ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ రావడమే. దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ టైంలో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ అంటూ ఒక చిత్రాన్ని ప్రకటించారు. ఆ టైంలో పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. దీనితో వెంటనే సినిమా పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో హరీష్ శంకర్ కొంత కాలం తర్వాత ఆ కథ వద్దని భావించారట. ఆ తర్వాత మళ్ళీ వేరే కథతో ఉస్తాద్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ కూడా వాయిదా పడుతూ రావడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతూ వచ్చింది. షూటింగ్ ఏళ్ళ తరబడి ఆలస్యం కావడమే ఈ చిత్రాన్ని ప్రధాన మైనస్.
హరీష్ శంకర్ ఫెయిల్యూర్ వెనుక రీజన్స్
హరీష్ శంకర్ ఒక కమర్షియల్ సినిమాకు ఎలాంటి అంశాలు అవసరమో అవన్నీ ఉస్తాద్ లో జోడించారు. సినిమా కొంత వరకు ఎంటర్టైనింగ్ గా కూడా ఉంది. కానీ ఈ తరహా కమర్షియల్ కథలకు ఎప్పుడూ కాలం చెల్లింది. ఇదే సినిమా ఐదేళ్ల క్రితం వచ్చి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేదేమో. ఇప్పుడంతా పాన్ ఇండియా చిత్రాలు, వైవిధ్యమైన కథల హవానే నడుస్తోంది.
గతేడాది పవన్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి హరిహర వీరమల్లు కాగా మరొకటి ఓజీ. ఓజీ మాత్రం సంచలన విజయం సాధించింది. ఎక్కువ గ్యాప్ లేకుండానే ఉస్తాద్ ని తీసుకురావడం కూడా కొంత మైనస్ అనే చెప్పాలి. అసలే బజ్ లేని సినిమా చూసేందుకు ప్రేక్షకులు రెడీగా లేరు.
పవన్ కళ్యాణ్ సినిమాకి ఎదురుదెబ్బ
గబ్బర్ సింగ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది. కానీ ఉస్తాద్ మ్యూజిక్ అంతగా కట్టుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ డ్యాన్సులతో కష్టపడ్డప్పటికీ ప్రభావం కనిపించలేదు. వీటన్నింటికీ తోడు ధురంధర్ 2 చిత్రానికి పోటీగా రిలీజ్ చేయడం కూడా మైనస్ అయింది.
ఈ చిత్రాన్ని దెబ్బ తీసిన అంశాల్లో రీమేక్ ప్రచారం కూడా ఉంది. సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు ఇది తమిళ తేరి చిత్రానికి రీమేక్ అంటూ అనేక ఊహాగానాలు వినిపించాయి. అప్పటికే తేరీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా చూసేశారు. రీమేక్ నిజమే అని కొందరు నమ్మడంతో ఈ చిత్రంపై అంతగా ఆసక్తి చూపలేదు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటాం.


