
పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి తాజా సమాచారం వెలువడింది. మూవీ యూనిట్ నుండి వచ్చిన అప్డేట్ ప్రకారం, సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Key Points
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు తాజా అప్డేట్!
పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కలిసి పనిచేస్తున్నారు.
సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ కు తాజా అప్డేట్
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఇటీవల తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసేయడానికి వరుసగా డేట్స్ ఇస్తున్నాడు. హరిహర వీరమల్లు పూర్తవగా ఇప్పుడు పవన్ OG షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇక అసలు సినిమానే ఉండదేమో అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంటుందని ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. కేవలం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ చేతులు మాత్రమే కనపడేలా ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ ఫ్యాన్స్ కోసం, మూవీ లవర్స్ కోసం రాబోతుంది, త్వరలోనే షూటింగ్ మొదలవ్వబోతుంది అని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పక్కాగా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్
గతంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు కాబట్టి ఈ సినిమాపై కూడా అంచనాలే ఉన్నాయి. అయితే గతంలోనే కొంత షూట్ చేసి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమా తేరి రీమేక్ అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు కథ అంతా మార్చేసి మళ్ళీ కొత్తగా షూట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Get ready to celebrate the best of POWERSTAR 🔥 #UstaadBhagatSingh – Written & directed by @harish2you 🔥 This one will be remembered and celebrated for many years.
షూటింగ్ త్వరలోనే ప్రారంభం
Stay tuned for more updates! @PawanKalyan @harish2you … pic.twitter.com/i07aXPZAhh
— Mythri Movie Makers (@MythriOfficial) May 22, 2025
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతుందని అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయింది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని అంచనాలున్నాయి.


