|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ సంచలనం: సినిమా చూడటం కంపల్సరీ కాదు! టికెట్లపై పవర్ స్టార్ మాస్ క్లారిటీ!!

Published: 16-03-2026, 6:00 AM
పవన్ కళ్యాణ్ సంచలనం: సినిమా చూడటం కంపల్సరీ కాదు! టికెట్లపై పవర్ స్టార్ మాస్ క్లారిటీ!!
  • పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 19న విడుదల కానుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ అదుర్స్!
  • టికెట్ ధరల పెంపుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు – ప్రభుత్వానికే 18% వెళుతుంది, బ్లాక్ టికెట్లకు చెక్!
  • ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
  • దేవిశ్రీ ప్రసాద్, తమన్ సంగీతం – మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక అదిరిపోయే న్యూస్! ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. టికెట్ ధరల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఎప్పుడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ ఉప ముఖ్య మంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఏ సినిమా వారు టికెట్ ధర పెంపు కోసం ప్రభుత్వాన్ని కోరిన వాటికి అప్రూవల్ ఇస్తున్నారు. దానిపై కొంతమంది అలా ఎందుకు ఇస్తున్నారు అని పెద్ద స్థాయిలో రగడ చేస్తున్న వారు కూడా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో హీరోగా నటించాడు.

టికెట్ ధరలపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?

ఈ మూవీని మార్చ్ 19వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అయ్యారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి కూడా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించాడు. టికెట్ ధరలను పెంచుతున్నారు అని కొంతమంది అంటున్నారు. అలా పెంచడానికి ఒక కారణం ఉంది. సినిమా చూడడం అనేది తప్పనిసరి చేయాల్సిన పని కాదు. ఎవరూ కూడా మనల్ని గన్ పాయింట్ పెట్టి మొదటి రోజే సినిమా చూడండి అని చెప్పరు.

సినిమాలో హీరోయిన్లు ఎవరో తెలుసా?

టికెట్ ధరలపై పెంచిన 18 శాతం ప్రభుత్వానికే వెళుతుంది. పెంచకపోతే కొంతమంది బ్లాక్ టికెట్ల రూపంలో దానిని ఎక్కువ ధరకు అమ్ముతారు, అది ప్రభుత్వానికి రాకుండా వేరే వారికి వెళుతుంది అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, తమన్ సంగీతం అందించారు.

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. పవర్ స్టార్ అభిమానులకు ఇది పండుగలాంటి వార్త. త్వరలోనే మరిన్ని వివరాలు అందిస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.