
📌 Key Points
- లక్కీ సారీలో ఎంట్రీ ఇచ్చి రేఖ రౌడీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
- శ్రుతి డిజైన్స్‌ను చూసి హర్ష అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు.
- హర్ష కంపెనీ నుంచి 3 నెలల కాంట్రాక్ట్‌లను శ్రుతికి అందించాడు.
- రాజు తెలివిగా రేఖ ప్లాన్‌ను పసిగట్టి, శ్రుతిని రక్షించాడు.
బ్రహ్మముడి సీరియల్ అభిమానులారా, లేటెస్ట్ ఎపిసోడ్ ఊహించని మలుపులతో ఉత్కంఠగా సాగింది! రేఖ ప్లాన్‌లను లక్కీ, రాజు ఎలా తిప్పికొట్టారు? శ్రుతికి హర్ష ఇచ్చిన భారీ ఆఫర్ ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
రేఖ ప్లాన్‌కు లక్కీ మాస్ షాక్!
Brahmamudi Serial June 29th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 29వ ఎపిసోడ్‌లో శ్రుతి డిజైన్స్‌తో వస్తుంది. అది చూసి రేఖ బిత్తరపోతుంది. హర్షకు డిజైన్స్ చూపించడంతో చాలా బాగున్నాయని, ఇందు గొప్ప బిజెనెస్ వుమెన్ అవుతుందని మెచ్చుకుంటాడు. చలపతి కంపెనీ ఓనర్ ఇంటికే వెంకీ స్వీట్స్ డెలివరీ ఇచ్చేందుకు వస్తాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి కోసం రాజు, ఇందు టెన్షన్ పడుతుంటారు. అది చూసి రేఖ తెగ సంతోషిస్తుంది. హర్ష గారు చాలా సీరియస్ అవుతున్నారు. వేరే వర్క్ ఉందట అని రేఖ చెబుతుంది. ఇంకా శ్రుతి వచ్చేలా లేదు. హర్ష గారిని వెళ్లమని చెబుతానని రేఖ అంటుంది.
శ్రుతి, ఇందు లోపలికి వెళ్తారు. శ్రుతి ఇక్కడ ఉంటే ఆ వెధవలు అక్కడేం చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది రేఖ. అప్పుడే పిన్ని మనసులో అనుకుంటే ఎలా ఓసారి కాల్ చేసి కనుక్కో ఆ ఇంట్లో ఎవరున్నారో తెలిసిపోతుందిగా అని రాజు వెళ్లిపోతాడు. తన ప్లాన్‌ను రాజు పసిగట్టాడని రేఖ షాక్ అవుతుంది. రేఖ పురమాయించిన రౌడీలకు కాల్ చేస్తుంది.
రౌడీలను తిడుతుంది రేఖ. ఇందాకే శ్రుతి సోడా తీసుకుని వస్తానని లోపలికి వెళ్లిందంటారు. తను ఆఫీస్‌కు వచ్చిందని రేఖ తిట్టి కాల్ కట్ చేస్తుంది. శ్రుతి ఆఫీస్‌కు వెళ్తే లోపల ఎవరున్నారని రౌడీలు అనుకుంటారు. ఇంతలో నిమ్మకాయ సోడా పట్టుకుని చీరలో లక్కీ ఎంట్రీ ఇచ్చి ఝలక్ ఇస్తాడు. లక్కీ ఇచ్చిన ట్విస్టుకు రౌడీలు షాక్ అవుతారు. మేడమ్ చెప్పింది నిజమేరా అని రౌడీలు అనుకుంటారు.
శ్రుతి డిజైన్స్‌కు హర్ష ఫిదా – భారీ ఆఫర్!
మనం మధ్యలో దూరి డీల్ క్యాన్సిల్ అయ్యేలా చేద్దామని రేఖ అనుకుంటుంది. అవును హర్ష గారు మీరు చెప్పింది నిజమే. ఇదేంటీ ఇందు ఇంత కేర్లేస్‌గా ఉన్నావు. హర్ష గారు డీల్ క్యాన్సిల్ చేసుకుంటారేమో అని రేఖ అంటుంది. మధ్యలో రాజు దూరి ఆ స్టోన్ మధ్యలో పెట్టడానికి కారణం చెప్పమని ఇందుతో అంటాడు. ఆ స్టోన్ అక్కడ పెట్టడం గురించి హర్షకు ఇందు వివరిస్తుంది.
అది విన్న హర్ష చాలా మెచ్చుకుంటాడు. ఈ డిజైన్స్ చాలా బాగా నచ్చాయని, అద్భుతంగా ఉన్నాయని పొగుడుతాడు. మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనండి. మీరు సూపర్. మీ అమ్మగారిలాగే ఈ డిజైన్స్ ఉన్నాయని, వీటిని మ్యాన్యుఫాక్చర్ చేయండి. 3 నెలల్లో వీటిని కంప్లీట్ చేస్తే మా కంపెనీ తరఫున వచ్చే అన్ని కాంట్రాక్ట్స్ మీకే ఇస్తామని హర్ష అంటాడు.
ఆ మాటలు ఇందు వింటుంది. మీ అమ్మ ప్రాణాలు అంటే లెక్కలేదా. నన్నే కాదంటావా అని రేఖ అంటే.. నా ప్రాణాలు కూడా లెక్కలేదని శ్రుతి అంటుంది. నేనంటే భయం పోయిందా అని రేఖ అంటే.. భయపడాల్సిన లేదు. ఇన్నేళ్లు మీరు చెప్పింది చేశాను. ఇందు గారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎవరికో భయపడి అది వమ్ము చేయలేను. రాజ్, కావ్య సర్ వల్లే మా ఫ్యామిలీ నిలబడింది. మీలా తిన్నింటి వాసాలు లెక్కపెట్టలేని అని శ్రుతి ఇచ్చి పడేస్తుంది.
రాజు ఎత్తుగడతో రేఖకు చెక్!
మీరు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదని శ్రుతి అంటుంది. మీ వల్లే ఈరోజు డీల్ పూర్తయిందని. మీరు చాలా గొప్పగా చేశారు. థ్యాంక్యూ శ్రుతి గారు అని హగ్ చేసుకుంటుంది ఇందు. మరోవైపు చలపతి, లక్ష్మీని కంపెనీ ఓనర్ ఇంటికి పిలిచి భోజనం పెడతాడు. దానికి చలపతి సంతోషిస్తాడు. మా కంపెనీకి చాలా సేవలు చేసినందుకు ఈ దసరాకి నీకు 5 నెలల బోనస్ ఇస్తున్నానని ఓనర్ చెబుతాడు.
మా కంపెనీ ఎదుగుదలకు ఎంతో కష్టపడ్డావ్. అందుకే బోనస్ ఇస్తున్నా అని ఓనర్ అంటాడు. ఇంతలో ఓనర్ కూతురు ప్రియను పరిచయంచేసి మూన్ స్టార్ కంపెనీలో పని చేస్తుందని చెబుతాడు. అదే కంపెనీలో తన కొడుకు వెంకటేశ్వర్లు పని చేస్తాడని చలపతి అంటాడు. అలాంటి పేరుతో ఎవరు లేరని ప్రియ అంటుంది. ఇంటికి వెళ్లాక అబ్బాయిని అడిగి కన్ఫర్మ్ చేసుకో అని ఓనర్ అంటాడు.
ఈ స్వీట్స్ నీకోసమే అని చలపతికి ఓనర్ ఇస్తాడు. మరోవైపు స్వీట్స్ తెచ్చి రేఖకు, అందరికి కంగ్రాట్స్ చెబుతాడు శేషు. మనం గెలవలేదు. రాజుగాడు గెలిచాడని భ్రమరాంబ అంటుంది. తెలుసు. మనం సక్సెస్‌ఫుల్‌గా పూర్తిగా ఓడిపోయాని చెప్పడానికే ఈ స్వీట్స్ పట్టుకొచ్చానని శేషు అంటాడు. రాజు, ఇందులను ఎంప్లాయిస్ దేవుళ్లలా చూస్తారు. వాళ్లకు తిరుగే ఉండదని అంటాడు.
బ్రహ్మముడి సీరియల్ లో ఈ ఊహించని పరిణామాలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టాయి. రేఖకు ఎదురుదెబ్బ, శ్రుతికి భారీ విజయం, లక్కీ సర్‌ప్రైజ్ ఎంట్రీతో ఎపిసోడ్ అదిరిపోయింది. మరిన్ని ఉత్కంఠభరిత అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

