
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరగనున్న వేడుక!
- విజయ్ తల్లి మాధవి: ‘విజయ్‌ని బాగా చూసుకునే కోడలు కావాలి’
- మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు!
- విజయ్ తండ్రి గోవర్ధన్ రావు: ‘భారతీయ అమ్మాయినే చేసుకోవాలి’
టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్. వీరి పెళ్లికి సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
విజయ్ రష్మికల పెళ్లి ఎక్కడ?
Vijay Rashmika : గత కొన్నేళ్లుగా సైలెంట్ గా ప్రేమించుకొని డేటింగ్ చేసిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ఉదయపూర్ లో ఫిబ్రవరి 26న వీరి పెళ్లి జరుగనుంది. ఇప్పటికే విజయ్, రష్మిక, వారి ఫ్యామిలీలు, సన్నిహితులు ఉదయపూర్ కి వెళ్లారు. మార్చ్ 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా జరగనుంది. ఈ క్రమంలో విజయ్, రష్మికకు సంబంధించిన పలు వార్తలు వైరల్ గా మారాయి.
గతంలో విజయ్ తల్లితండ్రులు తమకు ఎలాంటి కోడలు కావాలి అనేదానిపై ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలు వైరల్ గా మారాయి. విజయ్ సినిమా ఈవెంట్లో యాంకర్ సుమ మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలి అని అడిగింది.
కాబోయే కోడలు గురించి విజయ్ తల్లి ఏమన్నారంటే?
దానికి విజయ్ తల్లి మాధవి.. నాకు కోడలు విషయంలో ఒకే ఒక కండిషన్ ఉంది. విజయ్ ని మంచిగా చూసుకునే కోడలు రావాలి. ఆమె విజయ్ ని పూర్తిగా ప్రేమించాలి. మా అబ్బాయి సినిమా ఇండస్ట్రీ కాబట్టి అతన్ని వర్కింగ్ ని కూడా అర్థం చేసుకోవాలి అని తెలిపింది.
రిసెప్షన్ ఎప్పుడు, ఎక్కడ?
ఇదే ఈవెంట్లో విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా కాబోయే కోడలు గురించి మాట్లాడుతూ.. విజయ్ కి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుకోవాలని నేను అనుకుంటున్నాను. నాకు మతం, కులం.. లాంటి పట్టింపులు ఏమి లేవు కానీ ఇండియన్ మహిళనే పెళ్లి చేసుకోవాలి అని అన్నారు. మొత్తానికి విజయ్ తలితండ్రులు కోరుకున్నట్టు విజయ్ ని ప్రేమించి బాగా అర్ధం చేసుకునే రష్మిక దొరికిందని, తాను కూడా ఇండస్ట్రీ కాబట్టి విజయ్ వర్క్ ని అర్ధం చేసుకుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఫ్యాన్స్, నెటిజన్లు వీరి పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నారు.
విజయ్, రష్మికల పెళ్లి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఈ జంట ఎలా ఉండబోతుందో చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


