|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు పార్ట్ 2 పై నిధి అగర్వాల్ అప్డేట్.. పవన్ నుంచి ఇంకో సినిమా..

Published: 17-07-2025, 8:21 AM
Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు పార్ట్ 2 పై నిధి అగర్వాల్ అప్డేట్.. పవన్ నుంచి ఇంకో సినిమా..

Key Points

1

హరిహర వీరమల్లు పార్ట్ 2 షూటింగ్ 20% పూర్తయింది.

2

నిధి అగర్వాల్ పార్ట్ 2లో కూడా నటించనున్నారు.

3

పార్ట్ 1 హిట్ అయితేనే పార్ట్ 2 గురించి ఆలోచిస్తారు.

హరిహర వీరమల్లు పార్ట్ 2 షూటింగ్ ప్రోగ్రెస్

Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అయిదేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు జులై 24న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే హరిహర వీరమల్లు సినిమాకు రెండు పార్టులు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు వచ్చేది హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్. అయితే పార్ట్ 2 పై అందరికి సందేహమే ఉంది. ప్రమోషన్స్ లో కూడా పార్ట్ 2 గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు.

పవన్ ఫ్యాన్స్ లో అసలు హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉంటుందా? పవన్ మళ్ళీ డేట్స్ ఇస్తారా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో నిధి అగర్వాల్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడింది.

నిధి అగర్వాల్ కీలక వ్యాఖ్యలు

నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు పార్ట్ 2 షూటింగ్ కూడా 20 శాతం పూర్తయింది. పార్ట్ 2లో కూడా నేను ఉంటాను. మిగిలిన షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో తెలీదు అని చెప్పుకొచ్చింది.

పవన్ కళ్యాణ్ డేట్స్ మరియు భవిష్యత్తు ప్రణాళికలు

దీంతో హరిహర వీరమల్లు పార్ట్ 1 పెద్ద హిట్ అయి మంచి లాభాలు వస్తే పార్ట్ 2 గురించి ఆలోచిస్తారని తెలుస్తుంది. ఒకవేళ పార్ట్ 2 ఉంటె పవన్ చేతిలో ఉన్న OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల తర్వాత పవన్ కుదిరినప్పుడు డేట్స్ ఇచ్చి హరిహర వీరమల్లు పార్ట్ 2 సినిమాని 2027 వరకు లేదా ఎన్నికల ముందు తీసుకొచ్చే ప్లాన్ చేస్తారని టాలీవుడ్ టాక్. మరి హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉందా లేదా అనేది నిర్మాత, దర్శకులు రిలీజ్ అయ్యాక అయినా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

చివరగా, హరిహర వీరమల్లు పార్ట్ 2 తయారీ పూర్తిగా మొదటి భాగం విజయంపై ఆధారపడి ఉంది. పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల తర్వాతే పార్ట్ 2కు సమయం కేటాయించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.