
📌 Key Points
- ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ టాప్ 5లో ట్రెండింగ్! థియేటర్ డిజాస్టర్ తర్వాత ఊహించని విజయం.
- నిహారిక నిర్మించిన ‘రాకాస’ సినిమా నెట్‌ఫ్లిక్స్ టాప్ 7లో సత్తా చాటుతూ ఇండియాలో దూసుకుపోతోంది.
- పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోకు ఓటీటీలో భారీ ఆదరణ, డిజాస్టర్ నుండి సంచలనంగా మారింది.
- రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసి నెట్‌ఫ్లిక్స్ నెం.1గా నిలిచింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది! బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా, నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. అయితే ఈ సినిమాకు మరో తెలుగు కామెడీ చిత్రం నుండి ఊహించని పోటీ ఎదురైంది. అసలు ఏం జరుగుతోంది?
పవన్ కళ్యాణ్ సినిమాకు ఊహించని పోటీ!
ఈ సమ్మర్‌కి ఆడియెన్స్ థియేటర్లో కంటే ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఓటీటీ చిత్రాలకు డిమాండ్ పెరుగుతుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు నవ్వించే చిత్రాలు, యాక్షన్ సినిమాలు, థ్రిల్లర్స్ ని బాగా చూస్తున్నారు ఆడియెన్స్. అయితే థియేటర్లో ఆడని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతున్నాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా పలు క్రేజీ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. ధురంధర్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌తోపాటు మరో తెలుగు కామెడీ సినిమా కూడా రచ్చ చేస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1గా బాలీవుడ్ మూవీ `ధురంధర్` ట్రెండ్ అవుతుంది. ఇది గత రెండు నెలలుగా మొదటిస్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసుని షేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. దీనికి పార్ట్ 2 `ధురంధర్ 2` వచ్చి ఇప్పటికీ బాక్సాఫీసుని షేక్ చేస్తోంది. `బాహుబలి 2` రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా టాప్ 2లో తమిళ చిత్రం `యూత్` ఉంది. కుర్రాళ్లు కలిసి చేసిన ఈ చిత్రం థియేటర్లో బాగానే ఆడింది. ఇప్పుడు నెల రోజులకుపైగానే ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. టీనేజ్ లవ్ స్టోరీ, కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీలో ఎమోషన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది.
థియేటర్ ఫ్లాప్.. ఓటీటీలో బ్లాక్‌బస్టర్?
ఇక మూడో స్థానంలో `ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో` ట్రెండ్ అవుతుంది. నాల్గో స్థానంలో `ఇఫ్ విషెస్ కుడ్ కిల్` అనే హాలీవుడ్ షో ట్రెండ్ అవుతుండటం విశేషం.
ఐదో స్థానంలో తెలుగు మూవీ ఉండటం విశేషం. అదే పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్`. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. గత నెలలోనే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ దాదాపు మూడు వారాలుగా టాప్ 5లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఆరో స్థానంలో బాలీవుడ్ మూవీ `రోస్టర్` ట్రెండ్ అవుతుంది.
నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో తెలుగు జోరు!
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ 7లో మరో తెలుగు సినిమా ట్రెండ్ అవుతుంది. నిహారిక నిర్మించిన `రాకాస` చిత్రం ఇప్పుడు ఇండియా వైడ్‌గా మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో సంగీత్ శోభన్, నయనసారిక జంటగా నటించారు. కామెడీ హర్రర్, ఫాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ థియేటర్లో ఫర్వాలేదనిపించింది. కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది.
ఇక ఎనిమిదో స్థానంలో రాణీ ముఖర్జీ నటించిన `మర్దానీ 3`, 9వ స్థానంలో హిందీ వెబ్ సిరీస్ `గ్లోరీ`, పదో స్థానంలో `దో దీవానే సెహెర్ మెయిన్` అనే హిందీ చిత్రం ట్రెండ్ అవుతుంది.
ఓటీటీ వేదికగా తెలుగు సినిమాలు దూసుకుపోతున్న తీరు అద్భుతం! పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విజయంతో పాటు, ‘రాకాస’ లాంటి చిత్రాలు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి. మరిన్ని సంచలన ఓటీటీ అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!


