|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ తో చిరు స్టైల్ స్టెప్పులు.. థియేటర్లు షేక్!

Published: 22-01-2026, 4:05 AM
ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ తో చిరు స్టైల్ స్టెప్పులు.. థియేటర్లు షేక్!
  • పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ పూర్తి!
  • ఏప్రిల్ 23 లేదా 24న విడుదల కానున్న పవర్ స్టార్ మూవీ!
  • చిరంజీవి స్టైల్లో పవన్ కళ్యాణ్ కోసం అదిరిపోయే హుక్ స్టెప్!
  • దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ట్యూన్, చంద్రబోస్ సాహిత్యం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ గురించి ఒక అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ హుక్ స్టెప్ వేయనున్నారట. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పవన్ కళ్యాణ్ మూవీలో మెగా టచ్!

Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అప్‌కమింగ్‌ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశీ ఖన్నా కాంబినేషన్‌లో దర్శకుడు హరీశ్‌ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే వపన్ తన పార్ట్ షూటింగ్‌ కంప్లీట్ చేసుకున్నారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఫాస్ట్‌గా నడుస్తుందట. ఈ మూవీని ఏప్రిల్ 23 లేదా 24న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్. ఈ రెండు డేట్స్‌లో ఏదో ఒక తేదీ మాత్రం కన్ఫామ్‌ అంటున్నారు. అయితే రిలీజ్‌ డేట్‌తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్‌పై మరో టాక్ కూడా వినిపిస్తుంది.

దేవిశ్రీ స్పెషల్ ట్యూన్ రెడీ!

మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన హుక్ స్టెప్స్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చిరు హుక్ స్టెప్స్‌కు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో అయితే చిరు హుక్‌ స్టెప్స్‌పై రీల్స్ ఫుల్ లోడెడ్‌ అన్నట్లుగా ఉంది.

ఏప్రిల్ లో ఉస్తాద్ రిలీజ్!

ఇలాంటి హుక్ స్టెప్ ఉస్తాద్ భగత్ సింగ్‌ మూవీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కూడా వేయిస్తున్నట్లు టాక్. దీని కోసం ఓ సాంగ్‌ను కూడా రెడీ చేస్తున్నారట. హరీష్ శంకర్, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి పవన్ హుక్ స్టెప్ కోసం స్పెషల్‌ సాంగ్‌ను తయారు చేస్తున్నారట. మరో సాంగ్ కోసం వర్క్ అంటూ హరీశ్‌ శంకర్, చంద్రబోస్ పిక్స్ రిలీజ్ చేశారు. అయితే పవన్‌తో హుక్ స్టెప్ సాంగ్‌కే ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదే నిజం అయితే పవన్‌తో హుక్ స్టెప్స్‌కు థియేటర్లు రచ్చరచ్చే అంటున్నారు ఫ్యాన్స్‌.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అప్డేట్స్ ఇంతే. పవన్ కళ్యాణ్ హుక్ స్టెప్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.