
📌 Key Points
- పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ భారీగా తగ్గింపు! నిర్మాత కోసం త్యాగం, కేవలం 25 కోట్లు మాత్రమే!
- శ్రీలీల పారితోషికం 3 కోట్లు! ఇతర సినిమాలను వదులుకొని ‘ఉస్తాద్’ కోసం ప్రత్యేక శ్రద్ధ!
- రాశీఖన్నాకు 2 కోట్ల రెమ్యునరేషన్! పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్!
- ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల! పవన్, హరీష్ కాంబో మళ్ళీ సెన్సేషన్ సృష్టిస్తుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలోని నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఏమిటో చూద్దాం!
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తగ్గింపు వెనుక అసలు కారణం?
Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది రోజు రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ – హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు భారీగానే ఖర్చుపెట్టారు. మొదట షూట్ మొదలుపెట్టి తర్వాత ఎన్నికలు, పవన్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో మధ్యలో సినిమా ఆగిపోయింది. కొన్ని నెలల క్రితం పవన్ డేట్స్ ఇవ్వడంతో ఫాస్ట్ గా 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసారు. పవన్ డేట్స్ ఇవ్వడంతో రాశీఖన్నా, శ్రీలీల కూడా వేరే సినిమాలు చేస్తున్నా డేట్స్ అడ్జస్ట్ చేసారు.
శ్రీలీల, రాశీఖన్నా పారితోషికం ఎంతంటే?
తన రాజకీయాల వల్ల ఈ సినిమా లేట్ అవ్వడం, నిర్మాతకు భారం పెరగడంతో తన రెమ్యునరేషన్ సగానికి పైగా తగ్గించుకొని పవన్ కళ్యాణ్ కేవలం 25 కోట్లే తీసుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక శ్రీలీల వేరే సినిమాలు కూడా వదులుకొని ఈ సినిమా మీదే ఉండటంతో తనకు 3 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. అలాగే రాశీఖన్నాకు 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.
ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్.. రికార్డులు బ్రేక్ చేసేనా?
సినిమా షూట్ వాయిదా పడినా మొదలయిన తర్వాత మాత్రం 45 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసేయడంతో ప్రొడక్షన్ కాస్ట్ కాస్త తగ్గింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రెమ్యునరేషన్స్ తో కలుపుకొని దాదాపు 150 కోట్ల బడ్జెట్ అయినట్టు సమాచారం.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


