
📌 Key Points
- ఉగాదికి విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు!
- తొలిప్రేమ సాంగ్ రీమిక్స్: శ్రీలీల, పవన్ కెమిస్ట్రీ అదిరింది, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- హాస్పిటల్ సీన్, ఫైట్ సీన్స్: పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో కన్నీళ్లు ఆగవు!
- మొదటి రోజు 60 కోట్ల గ్రాస్: బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన ఉస్తాద్ భగత్ సింగ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదలయి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాపై మొదట్లో అంచనాలు లేకపోయినా, విడుదల తర్వాత మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. పవన్ కళ్యాణ్ మానియాకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ మానియా: ఫ్యాన్స్ ఫిదా!
Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కింది. రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు. మార్చ్ 19న ఉగాది సందర్భంగా ఈ సినిమా విడుదల అయింది.
అసలు ఈ సినిమా మీద హైప్ లేదు, ఫ్యాన్స్ కి కూడా నమ్మకం లేదు. ఎప్పుడో అయిదేళ్ల క్రితం ప్రకటించిన సినిమా, రీమేక్ అని వార్తలు, ఓ పక్క భారీ హైప్ ఉన్న సీక్వెల్ సినిమా రిలీజ్.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజయింది. కానీ అందర్నీ అంచనాల్ని తప్పని నిరూపించింది. రొటీన్ కమర్షియల్ స్టోరీ అయినా పవన్ కళ్యాణ్ మానియా తోడవడంతో కొత్తగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ సో సో గా నడిపించినా సెకండ్ హాఫ్ కి మాత్రం ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు. నార్మల్ ప్రేక్షకులు కూడా సినిమా బాగుంది అంటున్నారు.
పవన్ కళ్యాణ్ క్రేజ్ తో ఆన్లైన్ లో బుకింగ్స్ అదిరిపోతున్నాయి. మొదటి రోజు ఈ సినిమా దాదాపు 60 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. అయితే ఈ సినిమాలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యే సీన్స్ చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా అస్సలు మిస్ అవ్వొద్దు అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు.
ఉస్తాద్ భగత్ సింగ్ లో హైలెట్ సీన్స్ ఇవే..
శ్రీలీలతో కెమిస్ట్రీ: తొలిప్రేమ రీమిక్స్ అదుర్స్!
*తొలిప్రేమ సినిమాలోని ఈ మనసే.. సాంగ్ ని రీమిక్స్ చేసారు. సినిమాకు ఈ సాంగ్ చాలా ప్లస్ అయింది. ఈ సాంగ్ లో శ్రీలీల – పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా ఉంది. ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ ని ఎంజాయ్ చేస్తారు. వీరిద్దరి మధ్య వచ్చే కెన్నీ సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఆ పాటనే వాడారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ గుర్తొచ్చి నాస్టాల్జిక్ ఫీల్ అవుతారు.
*హాస్పిటల్ లో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యే సీన్, ప్రీ క్లైమాక్స్ లో ఓ ఫైట్ లో పవన్ ఎమోషనల్ అయ్యే సీన్స్ కచ్చితంగా ఫీల్ అవుతాం.
*పవన్ కళ్యాణ్ సినిమాలో గన్స్ ఉన్నాయి అంటే గన్స్ తో పవన్ ఆటలు మాములుగా ఉండవు. ఈ సినిమాలో చాలా సీన్స్ లో గన్స్ తో పవన్ ఆడేసుకుంటారు. పవన్ గన్ డీలింగ్ ఎంత స్టైలిష్ గా ఉంటుందో ఇటీవలే OG లో కూడా చూసాము.
*సినిమా ఓపెనింగ్ లో హీరో చిన్నప్పటి పాత్ర చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ సీన్ కూడా హైలెట్ గా ఉంటుంది. గబ్బర్ సింగ్ సీన్ గుర్తొస్తుంది.
రికార్డుల మోత: బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ విధ్వంసం!
*ఈ సినిమాలో మరో హైలెట్ సీన్ తరలి రాదా తనే వసంతం.. సాంగ్ తో వచ్చే యాక్షన్ సీన్. ఓ నేరస్థుడ్ని పవన్ కళ్యాణ్, అతని టీమ్ పట్టుకున్నప్పుడు ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంది. ఈ సాంగ్ అర్ధం అక్కడ సన్నివేశానికి కరెక్ట్ గా సరిపోతుంది. దానికి పవన్ కూడా అర్ధం చెప్తారు. ఈ సాంగ్ తో పవన్ కళ్యాణ్ కి ఇచ్చే ఎలివేషన్ కూడా అదిరిపోతుంది.
*ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ వేరే హీరోల సాంగ్స్ కి కామెడీగా స్టెప్పులు వేస్తారు. ఈ సీన్ కాసేపు నవ్విస్తుంది.
పవన్ ఫ్యాన్స్ మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఈ సీన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు, ముఖ్యంగా తొలిప్రేమ సాంగ్ అంటూ సినిమా చూసిన ఫ్యాన్స్ అంటున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని చూసి పండగ చేసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


