|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు షాక్! ప్రీ బుకింగ్స్‌లో ఊహించని పరిణామం! ఫ్యాన్స్ దిగ్భ్రాంతి!

Published: 13-03-2026, 7:05 AM
  • పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం.
  • అమెరికాలో ఆశించిన స్థాయిలో ప్రీ బుకింగ్స్ లేని కారణంగా అభిమానులు నిరాశ.
  • గతంలో పవన్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా బుకింగ్స్‌ను కూడా అధిగమించలేకపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.
  • రణ్‌వీర్ సింగ్ సినిమా విడుదల కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై ప్రభావం చూపింది.

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ బుకింగ్స్ పరిస్థితి

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి కాలర్ ఎత్తరా అంటూ థర్డ్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నప్పటికీ యూఎస్ఏ లో మాత్రం ఈ సినిమా పూర్తిగా అభిమానులను నిరాశ పరుస్తుందని చెప్పాలి. అక్కడ ఈ సినిమా ప్రీ బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయని చెప్పాలి . పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన హరిహర వీరమల్లు (HHVM)సినిమా బుకింగ్స్ ను కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బీట్ చేయలేకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా బుకింగ్స్ మాత్రం అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి.

అమెరికాలో నిరాశపరిచిన బుకింగ్స్

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా అంటేనే మరో గబ్బర్ సింగ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని ఊహించుకున్నారు .వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తిరిగి మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నప్పటికీ దారుణమైన బుకింగ్స్ అవుతాయని అభిమానులు కూడా ఊహించి ఉండరని చెప్పాలి. మరి రాబోయే రోజులలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ విషయంలో వీరమల్లు, ఓజి సినిమాలను బీట్ చేసి ముందుకు వెళ్తుందా లేదంటే అభిమానులను నిరాశ పరుస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ఈ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ప్రీ బుకింగ్స్ కు సరైన ఆదరణ లేకపోవడానికి కారణం లేదని చెప్పాలి ఇటీవల పవన్ నటించిన వీరమల్లు, ఓజి సినిమాలు అనుకున్న స్థాయిలో ఆదరణను నోచుకోని నేపథ్యంలో ఈ సినిమా ప్రీ బుకింగ్ ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు పోటీగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ సినిమా కూడా అదే రోజున విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ ప్రభావం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై పడిందనే చెప్పాలి. మరి మార్చి 19వ తేదీ రాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి అంచనాలను అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

సినిమాపై ఇతర సినిమాల ప్రభావం

మొత్తానికి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో బుకింగ్స్ పుంజుకుంటాయో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.