
📌 Key Points
- రవితేజ ‘BMW’ సినిమాలోని ‘వామ్మో వాయ్యో’ మాస్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
- ఆషిక రంగనాథ్‌కు ఇది తెలుగులో తొలి మాస్ సాంగ్, అనారోగ్యంతో ఉన్నా కష్టపడి డ్యాన్స్ చేసింది.
- సాంగ్‌కు వస్తున్న అద్భుత రెస్పాన్స్‌పై ఆషిక సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది.
- చిరంజీవి కూడా ‘BMW’ సెట్స్‌లో సందడి చేశారు, ఆ ఫోటోలని ఆషిక అభిమానులతో పంచుకుంది.
రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలోని ‘వామ్మో వాయ్యో’ మాస్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటకి వస్తున్న భారీ రెస్పాన్స్‌కి హీరోయిన్ ఆషిక రంగనాథ్ గాల్లో తేలిపోతోంది. తన తొలి మాస్ సాంగ్ అనుభూతిని, క్రేజీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
‘వామ్మో వాయ్యో’ పాట సూపర్ హిట్!
ఈ సంక్రాంతికి ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు మాస్ మహారాజ్ రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW), నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా సందడి చేయనున్నాయి. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల తర్వాత రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ సౌండ్ బాగా వినిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ కి ప్రేక్షకుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన వామ్మో వాయ్యో అనే మాస్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీత దర్శకుడు. ఊర మాస్ బీట్ తో ఉన్న ఈ పాటలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ గ్లామర్ ప్రదర్శిస్తూ డ్యాన్స్ తో రెచ్చిపోయారు.
దీనితో ఈ పాటకి యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కుతున్నాయి. వామ్మో వాయ్యో సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ తో హీరోయిన్ ఆషిక రంగనాథ్ గాల్లో తేలిపోతోంది. ఈ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో వామ్మో వాయ్యో సాంగ్ లొకేషన్ ఫోటోలని అభిమానులతో పంచుకుంది.
తొలి మాస్ సాంగ్‌తో ఆషిక సంతోషం
ఆషిక తన పోస్ట్ లో.. తెలుగులో నాకు తొలి మాస్ సాంగ్ ఇదే. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో అనారోగ్యంతో ఉన్నప్పటికీ వెనకడుగు వేయలేదు. ఎంతో కష్టపడి మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేశాను. ఈ సాంగ్ కి మీరు ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పడ్డ కష్టం మొత్తం వర్త్ అని అనిపిస్తోంది.
మీ అందరి ప్రేమకి థాంక్యూ. ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్, ఆయన టీం కి థ్యాంక్స్. రవితేజ, డింపుల్ హయతితో కలిసి డ్యాన్స్ చేయడం ఎంతగానో ఎంజాయ్ చేశాను అని ఆషిక పోస్ట్ చేసింది.
‘BMW’ సెట్స్‌లో మెగాస్టార్ సందడి
ఈ సాంగ్ షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, మన శంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి సెట్స్ లో సందడి చేశారు. ఆ దృశ్యాలని కూడా ఆషిక పోస్ట్ చేసింది. ఆషిక చిరంజీవితో కలిసి విశ్వంభర మూవీలో నటిస్తోంది.
A post shared by Ashika Ranganath (@ashika_rangnath)
మొత్తంగా, ‘వామ్మో వాయ్యో’ సాంగ్ ఆషిక కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక ఆమె పడ్డ కష్టానికి ప్రేక్షకుల అద్భుత స్పందనే నిదర్శనం. ఈ సాంగ్ విజయయాత్ర కొనసాగేలా ఉంది.


