
ఇంటిలో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఏ దిశలో ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం, డ్రెస్సింగ్ టేబుల్ దిశ వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈ కథనంలో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎలా ఉంచాలో తెలుసుకుందాం.
Key Points
డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పుడూ మంచానికి ఎదురుగా ఉంచకండి.
పడమర, దక్షిణ దిశల్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచడం మంచిది కాదు.
ప్రధాన ద్వారానికి ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంచవద్దు.
సరైన దిశలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
డ్రెస్సింగ్ టేబుల్‌ను ఏ దిశలో ఉంచాలి?
వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇంట్లో సంతోషం ఉంటుంది, ప్రశాంతత, ఆరోగ్యం కూడా మనతోనే ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ పెడుతున్నారు. బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ ఉండడం వలన సౌకర్యవంతంగా ఉంటుంది.
అయితే, డ్రెస్సింగ్ టేబుల్‌ను ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి. డ్రెస్సింగ్ టేబుల్ సరైన దిశలో లేనట్లయితే ఇబ్బందులు రావచ్చు. వాస్తు ప్రకారం డ్రెస్సింగ్ టేబుల్ ఏ దిశలో ఉండాలి? డ్రెస్సింగ్ టేబుల్ సరైన దిశలో లెక్కడపోతే చాలా సమస్యలు రావచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం కూడా తొలగిపోతుంది.
అద్దం కేవలం మనల్ని చూసుకోవడానికి మాత్రమే కాదు, అది ఇంట్లో శక్తులను రిలీజ్ చేస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్, అద్దం ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇంట్లో ఉన్నట్లయితే అది ఎనర్జీని రెట్టింపు చేస్తుంది. సరైన దిశలో ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సరైన దిశలో లేనట్లయితే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎటువంటి దిశలను నివారించాలి?
డ్రెస్సింగ్ టేబుల్‌ను ఏ దిశలో పెట్టకూడదు?
డ్రెస్సింగ్ టేబుల్, అద్దం ఎప్పుడూ కూడా మంచానికి ఎదురుగా పెట్టకూడదు. అలా చేయడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి, టెన్షన్ పెరిగిపోతుంది. అద్దం కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు.
పడమర, దక్షిణ దిశల్లో పెట్టకండి
వైవాహిక జీవితంపై ప్రభావం
వాస్తు ప్రకారం అద్దం ఎప్పుడూ కూడా పడమర లేదా దక్షిణ దిశలో ఉండకూడదు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈ రెండు దిశల్లో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరంగా కూడా సమస్యలు రావచ్చు. ఎప్పుడూ కూడా డ్రెస్సింగ్ టేబుల్‌ను ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టకూడదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
వాస్తు సూచనలను పాటించడం వలన సానుకూలత పెరుగుతుంది. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఇంటి శుభ్రత, శాంతిని కాపాడుకోండి.

