|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాస్తు ప్రకారం: ఇంట్లో అదృష్టం కోసం ఈ 5 పొరపాట్లు చేయకండి!

Published: 21-04-2025, 9:43 PM
వాస్తు ప్రకారం: ఇంట్లో అదృష్టం కోసం ఈ 5 పొరపాట్లు చేయకండి!

ఇంట్లో సంతోషం, అదృష్టం కోసం వాస్తు శాస్త్రం చాలా ముఖ్యం. కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఈ కథనంలో ఇంట్లో అదృష్టం కోసం చేయకూడని 5 పొరపాట్ల గురించి తెలుసుకుందాం.

Key Points

1

ఇంటి చుట్టూ చెక్కలు, ఇటుకలు వంటి వస్తువులు ఉంచకండి.

2

ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచకండి.

4

ఇంటి మధ్యస్థానం (బ్రహ్మస్థానం) ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి.

ఇంటి చుట్టుపక్కల శుభ్రత

ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. సంతోషంగా ఉండడానికి అనేక మార్పులు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండడానికి వివిధ రకాల పరిహారాను కూడా పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం కొన్ని పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఇవి దురదృష్టాన్ని కలిగిస్తాయి.

వాస్తు శాస్త్రం ఏం చెప్తోంది?

వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ఎటువంటి ప్రతికూల శక్తి ఉన్నా సరే తొలగిపోతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఇవి ప్రతికూల శక్తిని అడ్డుకుంటాయి.

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ఐదు తప్పులు జరగకుండా చూసుకోండి

మొక్కలు మరియు వాస్తు

ఇంటి చుట్టుపక్కల చూసుకోండి. చెక్కలు, టైల్స్, ఇటుకలు, ఇసుక బస్తాలు వంటివి మీ ఇంటి గోడల వద్ద ఉన్నట్లయితే వాటిని తొలగించాలి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహించకుండా అడ్డుకుంటాయి. ఇబ్బందుల్ని కలిగిస్తాయి.

గులాబీ మొక్కలు తప్ప ఇంట్లో ముళ్ళ మొక్కలు ఏవీ ఉండకుండా చూసుకోవాలి. ముళ్ళ మొక్కలు ప్రతికూల శక్తిని వ్యాపిస్తాయి. ఇంటిని నిర్మించేటప్పుడు క్యాక్టస్ మొక్కఉండడం మంచిది. ఇది నరదృష్టి సమస్యని తొలగిస్తుంది.

తలుపులు, కిటికీలకు వుండే హ్యాండిల్స్ వంటివి ఊడిపోతే కూడా కొత్త వాటిని పెట్టడం మంచిది. మార్చకపోతే కూడా సమస్యలు వస్తాయి.

4.విరిగిపోయిన లేదా పగిలిపోయిన వస్తువులు

విరిగిన వస్తువులు మరియు వాస్తు

ఇంట్లో విరిగిపోయిన లేదా పగిలిపోయిన వస్తువులు ఉండకూడదు. ఇవి ఉన్నట్లయితే అవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. సానుకూల శక్తిని తొలగిస్తాయి. కుళాయిలు కూడా సరిగ్గా ఉండాలి. నీళ్లు కారడం వంటివి జరగకూడదు.

ఇంటి మధ్య స్థానాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఇది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ఈశాన్యం, నైరుతి వైపు కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా వీటిని అనుసరించడం వలన ప్రతికూల శక్తికి దూరంగా ఉండవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంటిలో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు. ఈ సూచనలు పాటించడం వల్ల మీ ఇంటికి శుభం జరుగుతుంది. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.