|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

న్యూ బిగినింగ్ అంటూ అతని ఫొటో షేర్ చేసిన హీరోయిన్ వైష్ణవి.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

Published: 11-06-2025, 6:15 AM
న్యూ బిగినింగ్ అంటూ అతని ఫొటో షేర్ చేసిన హీరోయిన్ వైష్ణవి.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

ప్రముఖ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య తన సోషల్ మీడియాలో ఆనంద్ దేవరకొండ ఫోటోను పంచుకుంది. ‘న్యూ బిగినింగ్’ అని క్యాప్షన్ రాసి, కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం గురించి తెలియజేసింది. దీంతో ఆమె అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

Key Points

1

వైష్ణవి చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేసింది.

2

‘న్యూ బిగినింగ్’ అంటూ క్యాప్షన్ రాసింది.

4

ఫ్యాన్స్ వైష్ణవి పోస్ట్‌కు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వైష్ణవి చైతన్య కొత్త ప్రాజెక్ట్

యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’(Software Devoloper) వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీకి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అలా ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) సరసన ‘బేబీ’(Baby) మూవీలో నటించి తన యాక్టింగ్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఇక రీసెంట్‌గా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘జాక్’(Jack) మూవీలో నటించి ఓకే ఓకే అనిపించుకుంది.

ఆనంద్ దేవరకొండతో సహకారం

ఇక ఇటీవలే వైష్ణవి చైతన్య తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మరోసారి ఆనంద్ దేవరకొండ సరసన కనిపించనుంది. అయితే ఈ మూవీ పూజా కార్యక్రమం రీసెంట్‌గా జరుగగా దీనికి నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) ముఖ్య అతిథిగా హాజరయిన సంగతి తెలిసిందే. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, పార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్(Adithya Hasan) ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన 90s వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ఈ మూవీ రానుండగా.. ఇది వరకే ఓ వీడియో రిలీజ్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్

90s సిరీస్‌లో చిన్న వాడైన ఆదిత్య పదేళ్ల తర్వాత పెద్దవాడై లవ్‌లో పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు. వీరితో పాటే శివాజీ, వాసుకి కూడా మూవీలో నటించబోతున్నారు. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా వైష్ణవి తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అందులో ఆనంద్ దేవరకొండ ఫొటో షేర్ చేస్తూ.. ‘మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ.. న్యూ బిగినింగ్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన విషయాన్ని ఈ అమ్మడు ఇలా తెలియజేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వైష్ణవి చైతన్య మరియు ఆనంద్ దేవరకొండ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో, వారి అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.