
టాలీవుడ్‌లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలోని ఓ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్‌వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. తీరప్రాంత గ్రామీణ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా, ఇద్దరు అన్నదమ్ముల జీవితాలను కేంద్రీకరించి, వాలీబాల్ క్రీడలోని తీవ్ర పోటీ, భావోద్వేగాలు, మానవ సంబంధాల్ని ప్రతిబింబిస్తుంది. ఇక ఈ సినిమాకు ‘వాలీ’ టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. స్టార్ డైరెక్టర్ క్రిష్ జగర్లమూడి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మోషన్ పోస్టర్‌ను షేర్ చేశాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతూ మంచి స్పందన సొంతం చేసుకుంటుంది. కాగా.. ఈ చిత్రంతో రోనిత్ జీఆర్‌జీ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇదే చిత్రంతో పరిచయం కాబోతున్న నిపుణ్ సత్య ఈ చిత్రంలో ముఖ్య పాత్రను చేస్తున్నాడు. ఇందులో అభిగ్న్య వుత్తలూరు హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవి వర్మ, కల్పలత, వడ్లమాని శ్రీనివాస్, లక్ష్మణ్ మీశాల, కిరణ్ వరణాసి, రమణ భార్గవ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలపనున్నారు మేకర్స్.


