
📌 Key Points
- ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం నుండి ‘వామ్మో వాయ్యో’ సాంగ్ విడుదలైంది.
- మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్‌లు పాటలో నటించారు.
- కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ చిత్రం.
- పాటలోని లిరిక్స్, మ్యూజిక్, బీట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం నుండి ‘వామ్మో వాయ్యో’ మాస్ రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ పాట లిరిక్స్, మ్యూజిక్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట పూర్తి లిరిక్స్ ఇక్కడ చూడండి.
‘వామ్మో వాయ్యో’ సాంగ్ విశేషాలు
మాస్ మహారాజా రవితేజ ఇద్దరు భామలు డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్‌తో కలిసిన నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి మాస్ రొమాంటిక్‌గా వామ్మో వాయ్యో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో వామ్మో వాయ్యో సాంగ్ లిరిక్స్ ఏంటో చూద్దాం.
గత కొన్నేళ్లుగా వరుసగా ప్లాఫ్స్ చవిచూస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేయాలన్న డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రవితేజ వస్తున్నాడు. ఆ సినిమానే భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఎప్పుడు చూడని పాత్రలో రవితేజను చూపిస్తున్నారు డైరెక్టర్ కిశోర్ తిరుమల.
తాజాగా జనవరి 1న భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మాస్ అండ్ రొమాంటిక్‌గా సాగే వామ్మో వాయ్యో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మ్యూజిక్, బీట్స్, రచన అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వామ్మో వాయ్యో సాంగ్ లిరిక్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.
గా లచ్చుగాని ఎచ్చులు పాయె.. ఓ రామ రామ..
సెల్లు పాయె సిమ్ము పాయె.. ఓ రామ రామ..
గా సూరిగాని సొల్లు పాయె.. ఓ రామ రామ..
పువ్వు పాయె నవ్వు పాయె.. ఓ రామ రామ..
గీ పొట్టిదాని లవ్వు పాయె.. ఓ రామ రామ..
ముద్దు ముచ్చటంత పాయె.. మూతిపండ్లు రాలి పాయె..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
రవితేజ, భామల డ్యాన్స్ హైలైట్స్
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
గట్టు పాయె గెట్టు పాయె.. ఓ రామ రామ..
నెత్తి మీద జుట్టు పాయె.. ఓ రామ రామ..
సేను పాయె సెలక పాయె.. ఓ రామ రామ..
సేతిలోన పలక పాయె.. ఓ రామ రామ..
మన్ను పాయె మలక పాయె.. ఓ రామ రామ..
సిలకలొచ్చి ఎగిరి పాయె.. ఓ రామ రామ..
గిరక పాయె గిలక పాయె.. నులక మంచమిరిగి పాయె..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అప్‌డేట్స్
లంగ పాయె ఓణి పాయె.. ఓ రామ రామ..
కంచిపట్టు చీర పాయె.. ఓ రామ రామ..
పడుగు పాయె గొడుగు పాయె.. ఓ రామ రామ..
ఉన్నదంత ఊడ్సక పాయె.. ఓ రామ రామ..
వడ్లు పాయె ఎడ్లు పాయె.. ఓ రామ రామ..
కొంగుకున్న దుడ్లు పాయె.. ఓ రామ రామ..
బండ్లు పాయె గండ్లు పాయె.. తుపాకీల గుండ్లు పాయె..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
వామ్మో వాయ్యో ఒల్లెంకలో.. నేనేంజేతు సల్లెంకలో..
రవితేజ ‘వామ్మో వాయ్యో’ పాట విడుదలైన కొద్దిసేపటికే విశేష స్పందన అందుకుంటోంది. మాస్ బీట్స్, ఆకట్టుకునే లిరిక్స్‌తో ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పాట రవితేజకు మంచి హిట్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.


