|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వనవీరలో షాకింగ్ ట్విస్ట్: క్లైమాక్స్‌లో స్టార్ హీరో ఎంట్రీ! ఎవరా స్టార్?

Published: 27-12-2025, 9:28 AM
వనవీరలో షాకింగ్ ట్విస్ట్: క్లైమాక్స్‌లో స్టార్ హీరో ఎంట్రీ! ఎవరా స్టార్?
  • వనవీర(Vanaveera) సినిమా జనవరి 1న విడుదల కానుంది.
  • దర్శకుడు, హీరో అవినాష్ తిరువీధుల స్వయంగా నటించి, దర్శకత్వం వహించారు.
  • ప్రీ క్లైమాక్స్ లో స్టార్ హీరో క్యామియో ఉన్నట్లు అవినాష్ ధృవీకరించారు.
  • క్యామియో పాత్ర దాదాపు పది నిమిషాల పాటు తెరపై కనిపించనుంది.

అవినాష్ హీరోగా, దర్శకుడిగా వస్తున్న ‘వనవీర’ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఓ స్టార్ హీరో క్యామియో ఉందని, దాదాపు పది నిమిషాల పాటు తెరపై కనిపిస్తారని హీరో అవినాష్ వెల్లడించారు. ఈ వార్త ప్రస్తుతం సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వనవీర: పేరు మార్పు, విడుదల తేదీ

Vanaveera film: అవినాష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వనవీర(Vanaveera). మొన్నటి వరకు వానర పేరుతో ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసారు కానీ ఈ సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సెన్సార్ సమస్యల కారణంగా సినిమాని ‘ వానరా’ నుంచి ‘ వనవీర’ గా మార్చారు. ఈ సినిమా జనవరి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ వీడియో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా కుల రాజకీయాల అంశాలతో పాటు డివోషనల్ టచ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే రాముడు, వానర సైన్యం లంకకు సంబంధించిన విజువల్స్ చూపించడంతో ఇందులో డివోషనల్ టచ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. అవినాష్ తిరువీధుల హీరోగా దర్శకుడిగా పరిచయమవుతూ ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమా విడుదలకు మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్టార్ హీరో క్యామియోపై అవినాష్ క్లారిటీ

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అవినాష్ వెల్లడించారు. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో నటించబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయం గురించి మీడియా వారు అవినాష్ ను ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ఈ సినిమాలో స్టార్ హీరో క్యామియో ఉన్నమాట వాస్తవమే అని తెలిపారు. స్టార్ హీరో క్యామియో ప్రీ క్లైమాక్స్ ఉంటుందని దాదాపు పది నిమిషాల పాటు తెరపై కనిపిస్తారని ఈ పది నిమిషాలలోనే టాప్ లేపి వెళ్లిపోతారు అంటూ అవినాష్ తెలిపారు.

ఇలా ఈ సినిమాలో స్టార్ హీరో క్యామియో ఉండబోతుందనే విషయం గురించి క్లారిటీ ఇవ్వడంతో ప్రేక్షకులు కూడా ఆ స్టార్ హీరో ఎవరు? ఆయన ఏ పాత్రలో నటించబోతున్నారు? బహుశా హనుమాన్ పాత్రలో స్టార్ హీరో క్యామియో ఉండబోతుందా? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో నటించిన ఆ స్టార్ హీరో ఎవరు? అతని పాత్ర ఏంటి? అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇదివరకు వానర పేరుతో భారీగా ప్రమోషన్లను నిర్వహించిన చిత్రబృందం ప్రస్తుతం వనవీర పేరుతో ప్రమోషన్లను వేగవంతం చేశారు.

పది నిమిషాల పాటు కనిపించే స్టార్ ఎవరు?

వనవీర చిత్రంపై అంచనాలు భారీగా పెంచిన ఈ స్టార్ హీరో క్యామియో నిజంగానే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సస్పెన్స్ వీడాలంటే జనవరి 1న సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.